ప్రజాస్వామ్య విజయం!

tfpc-apnewsonline

నిర్మాతల మండలి ‘ఆఫీస్ బేరర్స్’ను నిర్మాతల మండలి సభ్యులు నేరుగా ఎన్నుకొనే ‘ప్రజాస్వామ్య హక్కు’ను తొలగించవద్దని అనేకమార్లు నిర్మాతలు స్వయంగా కోరినప్పటికీ వినకుండా, నియతృత్వ ధోరణిలో మండలి సెక్రటరీ కొడాలి వెంకటేశ్వర రావు ఎన్నికైన E.C మెంబర్స్ లో నుండి E.C మెంబర్స్ తిరిగి Office Bearers [President,Vice-Pesident,Secretary,Treasurer..]ను ఎంపిక చేసుకొనే ‘INDIRECT ELECTION’ ‘బై-లా’ ను ‘పాస్’ చేయిద్దామని 27.08.2016న జరిగిన ‘తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి Special General Body Meeting’లో శతవిధాల ప్రయత్నించినప్పటికీ అందుకు సమ్మతం తెలుపుతూ ‘ఇద్దరు సభ్యులు మాత్రమే’ చేతులు లేపగామిగతా సభ్యులు అందరూ వ్యతిరేకించి నిర్మాతల మండలి సభ్యుల ‘ప్రజాస్వామ్య హక్కు’ను కాపాడుకున్నారు.

 అడ్డదారిలో,అడ్డగోలుగా పదవుల్లో కొనసాగుదామనే ఆలోచనకు ఎదురైన ఘోర పరాజయం నుండి మేల్కోని ఇకనైనా Spl GBMలో ‘హామీ’ ఇచ్చిన విధంగా నెల రోజూల్లో ఎలెక్షన్స్ నిర్వహిస్తామన్న ‘మాట’ నిలుపుకొంటారని ఆశిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో, సభ్యుల మద్దతుతో మాత్రమే తమ పదవులను  నిలుపుకొమ్మని కోరుతూ,

‘ఇన్‌డైరెక్ట్ ఎలక్షన్’ వద్దని కోరుతూ మండలి సభ్యులకు SMS,Whatsapp ద్వారా పంపుతున్న అనేక మంది ‘నిర్మాతల మండలి సభ్యుల కూటమి’పై  ‘చర్యలు’ తీసుకుంటామని’ కొడాలి హెచ్చరికకు, ‘ఎటువంటి చర్య’ తీసుకున్నా వాటిని ‘చట్టపరంగా’ఎదుర్కోటానికి మేమందరం సిద్దంగా ఉన్నామని తెలియ చేసుకుంటూ, ఈ ‘ఉత్తర కుమార హెచ్చరికలు’ ఇకనైనా మానుకొమ్మని కొడాలి ని కోరుకుంటూ, TFPCని తన‘సొంత ప్రైవేట్ సంస్థ’లా భావించకుండా, ప్రజాస్వామ్య పద్దతిలో వెంటనే మండలి ఎన్నికలు నిర్వహించే ఏర్పాట్లు చెయ్యమని కోరుతున్నాం.

To Top

Send this to a friend