కాంగ్రెస్ కు బీజేపీకి తేడా యేంటి?

‘‘కాంగ్రెసోళ్లు చేశారని వారిని తిట్టిపోశాం.. అందుకే మీకు అధికారం ఇచ్చాం కదా.. ఇదేంటి బీజేపీ పెద్దలు.. వాళ్ల దారిలోనే నడిచారు. మీకు వాళ్లకు తేడా యేంటి..? ప్రజలు తిరస్కరించినా గద్దెనెక్కడం ఏమీ నీతి.. ప్రజాస్వామ్యం కూనీ చేసిందని గతంలో కాంగ్రెస్ ను తిట్టినోళ్లే మీరు కదా.. ఇప్పుడేంటి ప్రజాస్వామ్యబద్దంగా ఉండట్లేదు. కాంగ్రెస్ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు.. ’’

ఎన్నికల ఫలితాలు వెలుడిన తర్వాత బీజేపీ చేస్తున్న అనైతిక విధానాలు విస్తుగొలుపుతున్నాయి.. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రెస్ కు అనుకూలంగా తీర్పునిచ్చారు. కానీ ప్రజాస్వామ్యాన్ని తుంగలోతొక్కి డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేలను గుంజి లోబర్చుకొని కాంగ్రెస్ కు దక్కాల్సిన అధికారాన్ని బీజేపీ తన్నుకుపోవడం విస్మయం కలిగిస్తోంది. అక్కడి ప్రజల తీర్పును గౌరవించి తప్పుకోవాల్సిన బీజేపీ పెద్దలు ఇంత నిరంకుశంగా నిర్లజ్జగా వ్యవహరించడం విస్మయపరుస్తోంది..

* గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు. అందులో కాంగ్రెస్ కు 17, బీజేపీకి 13 వచ్చాయి. స్వతంత్రులు, ఇతర పార్టీల నేతలకు 9 మంది ఉన్నారు. అంటే ఇక్కడ ప్రజలు బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ ను గెలిపించారు. మరో నలుగురు మద్దతిస్తే కాంగ్రెస్ దే అధికారం కానీ.. ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. బీజేపీ పెద్దలు స్వతంత్రులను ప్రలోభపెట్టి ఆ తొమ్మిది మంది లాగి బీజేపీ ని అధికారమెక్కించారు. 17 మంది గెలిచినా అధికారం కళ్లముందు ఉన్నా కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామంటున్న బీజేపీ వ్యవహారశైలి..?

*ఇక మణిపూర్ లో అయితే మరీ ఘోరం.. ఇక్కడ మొత్తం 60 సీట్లకుగాను కాంగ్రెస్ 28,బీజేపీకి 21 స్థానాలు వచ్చాయి. ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్ ను గెలిపించారు. ఇక్కడ బీజేపీ కబంధ హస్తాలు పనిచేశాయి. తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్న ఎన్ పీపీ, ఎన్ పీఎఫ్ , ఒక ఎల్ జేపీ సభ్యుడిని కొనేసి దర్జాగా కాంగ్రెస్ కు దక్కాల్సిన అధికారాన్ని గద్దల్లా ఎత్తుకెళ్లిపోయారు. ఇదో పెద్ద దుర్మార్గమైన చర్య..

చెప్పేవి శ్రీరంగ నీతులు.. కానీ చొచ్చేది ఇలా.. తగలడింది.. ప్రసంగాలివ్వమంటే బీజేపీ నేతలు, ఆ బాస్ తెగ వాదిస్తారు. ప్రజాస్వామ్యం, అవినీతి రహితం అని బల్లగుద్ది చెబుతారు. కానీ ఆచరణలోకి వచ్చాక ఏం పుడుతుందో వీరికి.. ఇలా అడ్డంగా కొల్లగొట్టేస్తారు. అందుకే గడిచిన కాంగ్రెస్ వోళ్లకు. . వీళ్లకి తేడాలేనేలేదు. వాళ్లు ఆక్రమణ దారులే.. వీళ్లు ఇంకా నీతులు చెప్పి మోసం చేసే దురాక్రమణ దారులే..

To Top

Send this to a friend