ప్చ్.. చంద్రబాబూ..పవన్ రావాల్సిందే..

‘ఒక ఓటరుగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఏపీలో అధికారంలోకి వస్తాడని నమ్ముతున్నా.. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు వందశాతం అసంతృప్తికరంగా ఉంది. రాజధాని తప్ప అక్కడ ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు..అవినీతి, అధికార దుర్వినియోగం పెరుగుతోందని విమర్శలున్నాయి. ఏపీ ప్రభుత్వం అంతలా పనిచేయడం లేదని అందరూ అంటున్నారు. అందుకే 2019 ఎన్నికల్లో నిజాయితీ పరుడు అయిన పవన్ కల్యాణ్ కే ఓటెయ్యాలి. అతను జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టి నష్టపోయాడు తప్పితే ఎదుటివాళ్లను ఎప్పుడు నష్టపరచని నిజాయితీపరుడుు.. సగటు ఓటరుగా నా ఓటు కళ్యాణ్ కే’’ నని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్ అన్న.. మెగా బ్రదర్ నాగబాబు.. ఓ చానల్ తో జరిపిన చిట్ చాట్ లో తన విశేషాలను, రాజకీయ, పర్సనల్ విషయాలను వివరించాడు..

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ 2019 ఎన్నికలుంటాయి. కాబట్టి 2018 నుంచే పవన్ ఎన్నికలకు వెళ్లాలి. సినిమాలకు గ్యాప్ ఇవ్వాలి. వపన్ కు సపోర్టుగా తాను రాజకీయాల్లోకి వస్తా.. కళ్యాణ్ అడగకపోతే నేనే అడుగుతా.. చేస్తానని.. నా కష్టాల్లో అన్నయ్య చిరుతో పాటు పవన్ భాగం పంచుకున్నారు. అందుకే కల్యాణ్ కు అవసరం అయితే తాను జనసేన లో చేరి బాధ్యతలను పంచుకుంటానని నాగబాబు స్పష్టం చేశారు..

పవన్ లాంటి నిజాయితీ పరుడు, నిస్వార్ధుడు రాజకీయాల్లోకి రావాలని.. వస్తే కేజ్రీవాల్ లా ఖచ్చితంగా ఢిల్లీలో గెలిచినట్టు క్లీన్ స్వీప్ చేస్తాడని నాగబాబు స్పష్టం చేశాడు. నేనైతే పవన్ రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వానికి ఓటు వేయను.. పవన్ కు మద్దతుగా జనసేన తరఫున ప్రచారం చేస్తానని నాగబాబు తమ్ముడిపై ప్రేమను చాటుకున్నారు..

To Top

Send this to a friend