ప్చ్.. అది కేసీఆర్ కట్టింది మరి.. అదే బాబు కట్టుంటే లొల్లిలొల్లే..

ఈరోజు తెలంగాణలో ఏ పత్రిక మొదటిపేజిని చూసినా.. ఒక్కటే కనపిస్తుంది అది.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలేరు ఎత్తిపోతల పథకం పూర్తయి నేడు ప్రారంభోత్సవం జరుగుతున్న ప్రకటన.. కేసీఆర్ అన్ని పత్రికలకు తన ఘనతను చెప్పుకునేందుకు ఇలా ప్రకటనలు కుమ్మరించడం వరకు బాగానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పాలన, అభివృద్ధి పనులు చెప్పుకుంటేనే కదా అందరికీ తెలిసేది.. ప్రజలకు చేరువై నాలుగు ఓట్లు పడేవి.. అందుకే కేసీఆర్ పత్రికలకు , చానాల్లకు ప్రకటనలు ఇవ్వడాన్ని ఎవ్వరూ తప్పుపట్టలేరు..

కానీ ఇన్ని కోట్లు కుమ్మరించి ప్రకటనలిస్తున్నా కేసీఆర్ కు రావాల్సినంత క్రెడిట్ రావట్లేద్దన్నది టీఆర్ఎస్ నాయకుల ఆవేదన.. నిజమే.. ఎంత చేసినా ఏం లాభం.. లేకుండా పోతోంది. కేసీఆర్ కేవలం 11నెలల్లోనే గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోసి కరువు ప్రాంతమైన పాలేరుకు ఎత్తిపోతల ద్వారా నీటిని తేవడం అంటే మాటలు కాదు.. అదే మన రాజన్న వైఎస్ రాజ్యంలో ఏళ్లకు, ఏళ్లు, కోట్లకు కోట్లు కుమ్మరించడానికే సరిపోయేది.. పనులు కాకపోయేవి.. పైసలు పోయేవి.. కానీ ఇది తెలంగాణ ప్రభుత్వం… శంకుస్థాపన చేసిన 11 నెలల్లోనే సాధించేసింది. అదీ కేసీఆర్ ఘనత..

చంద్రబాబు ఏం తక్కువ తినలేదు.. కృష్ణా, గోదావరిలను కలిపే వట్టిసీమ ప్రాజెక్టును కేవలం ఏడాదిలో పూర్తి చేసి కేసీఆర్ కంటే ముందే శభాష్ అనిపించుకున్నరు. కాలువలు తెగాయని.. మట్టికట్టుల బాగా చేయలేదని.. అవినీతి ఏరులై పారిందని వైసీపీ ఆరోపించినా ఎక్కడా వారి పప్పులు ఉడకలేదు. ఎందుకంటే అక్కడ అధికార పక్షం.. చంద్రబాబు అనుకూల మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందుకే బాబు ఏడాదిలో పూర్తి చేసిన వట్టిసీమ ప్రాజెక్టును ప్రపంచంలోని అందరికీ.. ఏపీలోని చిన్న పిల్లాడికి కూడా తెలిసేలా చంద్రబాబు అనుకూల మీడియా తెగ ప్రచారం చేసి బాబును ఆకాశానికెత్తేసింది..

కానీ ఇప్పుడు కేసీఆర్ అదే చేశారు. చంద్రబాబు కంటే ఒక నెలముందే ఓ ప్రాజెక్టును పూర్తి చేసి కరువు ప్రాంతంతో అల్లాడుతున్న పాలేరుకు గోదావరి నీటిని అందించారు. తెలంగాణ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. కానీ ఎక్కడా ఈరోజు చూసిన పత్రికల్లో వార్తలు, న్యూస్ చానల్స్ లో కేసీఆర్ సాధించిన ప్రగతి..పాలేరు ప్రాజెక్టును సాధించిన తీరు.. ఆ ప్రాజెక్టుపై వార్తలే రావడం లేదు.. ప్చ్.. ఏం చేస్తా.. అదే చంద్రబాబు చేసుంటే.. ఈరోజంతా ఆ ప్రాజెక్టు వార్తలే వచ్చేవి. కానీ కేసీఆర్ చేశారు కదా.. అందుకే మీడియా తొక్కేస్తోంది..

To Top

Send this to a friend