పోలీసుల దాష్టీకం.. జల్లికట్టు లొల్లిలో సామాన్యులు బలి..

వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు.. చైన్నై మెరీనా బీచ్ చుట్టుపక్కల గుడిసె వేసుకొని నివాసం ఉండి పొట్టపోసుకుంటున్నారు. జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారిన వేళ పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. అక్కడున్న విద్యార్థులను చెదరగొట్టడంతో పాటు అక్కడే నివాసం ఉంటున్న కూలీల గుడిసెల్ని మహిళల్ని తరిమి తరిమి కొట్టారు. ఈ వీడియోలు బయటకు రావడంతో తమిళనాట పోలీసుల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ దాడుల్లో పోలీసులు విద్యార్థులను , కూలీలను ఎవ్వరినీ వదలకుండా చితకబాదేవారు. జల్లికట్టు ఆందోళనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. అక్కడే నివాసముంటున్నామని పేద మహిళలు, కూలీలు మొరపెట్టుకున్నా పోలీసులు మాత్రం పట్టించుకోకుండా చావబాదేశారు. ఈ ఆందోళనలో రెచ్చిపోయిన విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్ కు నిప్పంటించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.. నానా బీభత్సం సృష్టించారు.

పోలీసులు సృష్టించిన బీభత్స కాండను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend