పేరు బాలయ్యది.. కలెక్షన్లు చిరంజీవీవి..

తెలుగు సినిమా గర్వించే రీతిలో .. తెలుగు మహారాజు కథను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి.. బాలయ్య, క్రిష్, మీడియా ఈ సినిమాకు భారీ హైప్ ను తీసుకొచ్చారు. అందరూ చూడాల్సిన సినిమా అని ఊదరగొట్టారు.ఇక సంక్రాంతి బరిలో బాలయ్యతో పోటీగా బరిలోకి దిగిన చిరు ఖైదీనంబర్ 150 కూడా గ్రాండ్ గా హిట్ అయ్యింది. సంక్రాంతి బరిలో దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత చిరు దిగడంతో కలెక్షన్ల సునామీ సృస్టించింది. బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. తొలివారంలోనే 100 కోట్లు కొల్లగొట్టిన చిరు ఇఫ్పటికే ఇంకా చాలా గ్రాస్, షేర్ సాధించారు.

ఇక సంక్రాంతికి రిలీజ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అమెరికా, తెలుగు మార్కెట్లలో విజయాలనందుకుంది. కానీ ఈ సినిమాకు కేవలం నగరాలు, అమెరికా లాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయట.. బీ, సీ సెంటర్ల జనాలు ఈ హిస్టరీ ఓరియెంట్ చిత్రాన్ని చూడడానికి ఇష్టపడకపోవడంతో అక్కడ కలెక్షన్లు బాగా తగ్గినట్టు సమచారం. బీ, సీ సెంటర్ల జనం మాస్ ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు. అందుకే వీరికి శాతకర్ణి, కంటే చిరు ఖైదీ సినిమా చేరువయ్యింది. అందుకే సంక్రాంతి దాటి 15 రోజులవుతున్న నేపథ్యంలో చిరు ఖైదీ సినిమా కలెక్షన్లు దాదాపు 150కోట్లకి చేరువవుతుండగా.. శాతకర్ణి వసూళ్లు ఇంకా 50-60 కోట్లు మాత్రమే వసూళ్లు వచ్చాయట.. తొలివారంలోనే బాగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాలకు ఆ తర్వాత వసూళ్లు తగ్గిపోయాయి. కానీ బీ, సీ సెంటర్లలో చిరు సినిమాకు ఆదరణ పెరిగి కలెక్షన్లు వచ్చిపడుతున్నాయి. అదే బాలయ్య శాతకర్ణికి అక్కడే మైనస్ గా మారింది..

To Top

Send this to a friend