పెదరాయుడు గెటప్ లో సీమ సింహంలా..

katama_rayudu_poster-new

కదిలే నరసింహుడిలా ఈ కాటమ రాయుడు కొత్త సంవత్సరం వేళ సందడి చేశాడు.. కొత్త సంవత్సరం కానుకగా పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ అభిమానుల్ని విపరీతంగా అలరిస్తోంది.. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తమిళ సినిమా వీరంకు రిమేక్ గా తెరకెక్కుతోంది. కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తున్నారు. పోస్టర్ చూస్తే పెదరాయుడిలా పెద్దమనిషి పాత్రలో ఒదిగిపోయినట్టు కనిపిస్తోంది. ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
పవన్ కళ్యాన్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. గోపాల గోపాల దర్శకుడు డాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

To Top

Send this to a friend