పుస్తకాల పురుగులు కాదు.. ఐఐటీ ప్రేమికులు


దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఏవీ..? ఐఐటీలు.. ఇందులో చదివిన సుందర్ పిచాయ్ లాంటి వాళ్లు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సీఈవోగా రాణిస్తున్నారు. అంతటి గొప్ప ఐఐటీల్లో అందరూ పుస్తకాల పురుగులే ఉంటారనుకుంటే పొరపాటు.. అందులో ప్రేమికులు ఉన్నారు. వారి హృదయాలు మనకూ వినిపిస్తాయి. పుస్తకాలతో కుస్తీ పట్టి అద్భుతాలు ఆవిష్కరించడమే కాదు.. ప్రేమలో పడి అద్బుత కావ్యాలను రచించవచ్చని తేలింది..

ప్రేమికుల దినోత్సవం రోజున ఐఐటీ రూర్కే స్టూడెంట్ తమ ప్రేమ కళాపోశనను ఆవిష్కరించారు. వేలంటైన్స్ డేను గొప్పగా జరుపుకున్నారు. ఒక మాంచి వీడియోను తీసి యూట్యూబ్ లో పెట్టారు. హాలీవుడ్ పాప్ సింగర్ ఎడ్ షరీన్ గ్రామీ అవార్డ్స్ ఫంక్షన్లో పాడిన పాట ‘షేప్ ఆఫ్ యు’ కి వీరందరు స్టెప్పులేశారు. ఈ అద్భుత పాటకు ఐఐటీ రూర్కే విద్యార్థులు తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. ఆ పాటను మీరూ చూసి ఆనందించండి.. కింద వీడియో లింక్ లో..

To Top

Send this to a friend