పుడితే తెలంగాణలో సైనికుడై పుట్టాలి..

దేశ రక్షణలో తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడుతారు సైనికులు.. అంతటి త్యాగధనులకు సర్వీసులో ఉన్నప్పుడు.. రిటైర్ అయ్యాక మనం చేసేది శూన్యం.. కానీ తెలంగాణ ప్రభుత్వం వారిని నెత్తిన పెట్టుకుంది. సీఎం కేసీఆర్ సైనికుల సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సైనికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని తెలంగాణ శాసనసభ సాక్షిగా ప్రకటించారు..
తెలంగాణ సైనికులు అమరులైనా.. వారికి అవార్డులు దక్కినా ప్రభుత్వం ప్రోత్సాహకంగా నగదును ఇస్తుందని ప్రకటించారు. పరమ వీరచక్ర, అశోకచక్ర అవార్డులు పొందిన సైనిక కుటుంబాలకు రూ.2.25 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించి సీఎం కేసీఆర్ సంచలనం సృష్టించారు. ఇది దేశంలోనే అన్ని రాష్ట్రాలు ఇచ్చే దానికంటే భారీ మొత్తం.. ఈ ప్రకటనతో సైనిక సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ పేరు మారుమోగిపోతోంది…
అంతేకాదు.. సైనికులకు రాష్ట్రంలో సైనిక సంక్షేమ ప్రత్యేకనిధిని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొత్త జిల్లాల్లోనూ సైనిక సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సైనికుల కోసం పన్నుల్లో మినహాయింపులు, రెండు పడకల ఇళ్లలో కోటా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. త్వరలో వరంగల్ సైనిక్ స్కూలుపై కేంద్రంతో ఒప్పందం చేసుకోనున్నట్లు కేసీఆర్ తెలిపారు. మొత్తంగా సైనికులకు దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని ప్రోత్సాహకాలు ప్రకటించి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు..

To Top

Send this to a friend