‘పిట్టగోడ’నాకు చాలా మంచి పేరు వస్తుంది  – హీరోయిన్‌ పునర్నవి 

14 
‘అష్టాచెమ్మా’తో నాని, అవసరాల శ్రీనివాస్‌, కలర్స్‌ స్వాతిలను పరిచయం చేసిన రామ్మోహన్‌, ‘ఉయ్యాలా జంపాలా’తో రాజ్‌తరుణ్‌, అవికా గోర్‌లను పరిచయం చేశారు. ఆ రెండు చిత్రాలు సూపర్‌హిట్‌ అయి ఆ చిత్రాల్లో నటించిన హీరోహీరోయిన్‌లు ఇప్పుడు మంచి ఫామ్‌లో వున్న విషయం అందరికీ తెల్సిందే. తాజాగా ‘పిట్టగోడ’ చిత్రంతో విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవిలను హీరోహీరోయిన్స్‌గా పరిచయం చేస్తూ అనుదీప్‌ కెవి దర్శకత్వంలో డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమాస్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై రామ్మోహన్‌ పి. నిర్మించిన చిత్రం ‘పిట్టగోడ’. ఈ చిత్రం డిసెంబర్‌ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ పునర్నవి పత్రికా విలేఖరులతో మాట్లాడారు.
హీరోయిన్‌ పునర్నవి మాట్లాడుతూ – ”మా నేటివ్‌ ప్లేస్‌ విజయవాడ. కెనడాలో చదువుకున్నాను. విల్లామేరీ కాలేజ్‌లో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. చిన్నప్పటి నుండి డ్యాన్స్‌లు బాగా చేసేదాన్ని. ఆ ఇంట్రెస్ట్‌తో యాక్టింగ్‌ మీద కాన్‌సన్‌ట్రేట్‌ చేసాను. మధు ఊటీ, రత్నశేఖర్‌లు నా గురువులు. వాళ్ల ఆధ్వర్యంలో థియేటరీ కోర్స్‌ నేర్చుకున్నాను. ఫస్ట్‌టైమ్‌ ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంలో సునీత క్యారెక్టర్‌లో నటించాను. ఆ చిత్రంలో నా క్యారెక్టర్‌కి చాలా మంచి పేరు వచ్చింది. ఆ టైమ్‌లోనే అనుదీప్‌తో పరిచయం ఏర్పడింది. ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రానికి అనుదీప్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారు. సన్‌షైన్‌ సినిమాస్‌ ప్రొడక్షన్స్‌లో టు ఇయర్స్‌ వర్క్‌ చేసిన అనుదీప్‌ తన లైఫ్‌లో జరిగిన కొన్ని రియల్‌ ఇన్సిడెంట్స్‌ని బేస్‌ చేసుకుని ‘పిట్టగోడ’ కథ రెడీ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా యాక్ట్‌ చెయ్యమని అనుదీప్‌ అడగటంతో వెంటనే ఓకే చెప్పాను. వన్‌ అవర్‌ స్టోరీ నేరేట్‌ చేశారు అనుదీప్‌. స్క్రిప్ట్‌ విని బాగా నవ్వాను. అంత బాగా స్టోరీకి కనెక్ట్‌ అయ్యాను. రామ్మోహన్‌గారు, సురేష్‌బాబుగారి బేనర్స్‌లో ఆపర్చ్యునిటీ రావడం గాడ్‌ గిఫ్ట్‌గా భావిస్తున్నాను. ఈ చిత్రంలో నటించే ఛాన్స్‌ ఇచ్చిన రామ్మోహన్‌గారికి, సురేష్‌బాబుగారికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రంలో దివ్య క్యారెక్టర్‌లో యాక్ట్‌ చేశాను. ఒక నలుగురు కుర్రాళ్లు ఫ్రెండ్స్‌గా పరిచయం అవుతారు. వారిని మోటివేట్‌ చేసి, ఎంకరేజ్‌ చేసే క్యారెక్టర్‌ నాది. అనుకోకుండా చాలా ఈజీగా టిప్పు ప్రేమలో పడుతుంది దివ్య. అతను లైఫ్‌లో సాధించబోయే గోల్‌కి బాగా కాన్ఫిడెన్స్‌ ఇస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి కమలాకర్‌ టెరిఫిక్‌ ఆడియో ఇచ్చారు. పాటలన్నీ మంచి హిట్‌ అయ్యాయి. ‘జరిగినే’ ‘తియ తియ్యని’ పాటలు నాకు చాలా నచ్చాయి. పేథాస్‌ సాంగ్‌ బ్యూటిఫుల్‌గా వుంటుంది. ఈ చిత్రంలో నేనే డబ్బింగ్‌ చెప్పాను. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది. ఉదయ్‌ కెమెరా విజువల్స్‌ అద్భుతంగా వుంటాయి. డైరెక్టర్‌ అనుదీప్‌ ఫుల్‌ క్లారిటీతో నేచురల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాడు. సినిమా అందరూ ఎంజాయ్‌ చేసే విధంగా వుంటుంది. ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన రామ్మోహన్‌గారు ‘పిట్టగోడ’ చిత్రంతో మాలాంటి వారందర్నీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు ఆయనకు నా ధన్యవాదాలు. హీరోయిన్‌గా కంటే ఆర్టిస్ట్‌గా మంచి డెప్త్‌ వున్న ఫిమేల్‌ క్యారెక్టర్స్‌ చేసి నన్ను నేను నిరూపించుకోవాలని వుంది. ప్యాషన్‌తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవావలని ఇండస్ట్రీకి వచ్చాను. ‘పిట్టగోడ’ చిత్రంతో నాకు చాలా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. అదంతా ప్రేక్షకుల చేతిలో వుంది. చిరంజీవిగారు, పవన్‌కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ అంటే బాగా ఇష్టం. అలాగే తమన్నా, సమంతాలు నాకు రోల్‌ మోడల్స్‌. యాక్టింగ్‌, డ్యాన్స్‌, డిసిప్లిన్‌ విషయంలో తమన్నా అంటే నాకు చాలా ఇష్టం. అందరూ చాలా కష్టపడి చేస్తారు. హీరోయిన్‌గా చేయడం చాలా కష్టం. ఎంతో డెడికేషన్‌, డిసిప్లిన్‌ కావాలి” అన్నారు.
To Top

Send this to a friend