పాస్ గ్యారంటీ పెన్…


మార్చ్ వచ్చిందంటే పరిక్షలు హడావుడి ముందునుంచి చదివే వాళ్ళు కొద్దిమంది వన్డే బ్యాటీంగ్ అనే వాళు చాలామంది. చదివినవి గుర్తు రావాలని, రాకపోఇనా నువ్వే గుర్తు చేసి రాఇంచు స్వామీ అని పెన్నులు దేవుడి ద్దగ్గర పెట్టి ప్రార్దిస్తారు ,పేపర్ పై పెన్ పెట్టగానే సరైన నమాదానాలు తప్పులు లేకుండా రాశి మంచి మార్కుల తో పాస్ అవ్వాలి శ్వామీ అని దేవుణ్ణి ఇబ్బంది పెట్టేస్తారు విధ్యార్ధులు.

సరిగ్గా ఇదే విషయాన్ని క్యాష్ చేసు కుంటున్నాడు ఓ బాబా.తన దగ్గర పెన్ కొంటే పాస్ గ్యారంటీ ఏందుకంటే హనుమాన్ ,సరశ్వతీ పూజ తొ మహిమలు వచ్చాయని కష్టబంజన్ దేవాలయంలొ స్తానికుడైన దుశ్యంత్ బాపుజీ అనే బాబా ధర కేవలం 1900/- లే పాస్ అవ్వకపోతే డబ్బు వాపస్ అని గ్యారంటీ గా చెప్పి అమ్మేస్తున్నాడట.

ఈ విషయం గుజరాత్ లోని పంచమహల్ జిల్లాలో చోటు చేసుకుంది,ఈ మహిమ గల పెన్ విషయాన్ని ఆ జిల్లాలొ పలుచోట్ల కరపత్రాలు పంచటం తొ వెలుగులోకి వచ్చింది.అందరూ గుజరాత్ వెళ్ళడం కుదరదు, మరి బాబా గారికి ఆన్లైన్ ఐడియ ఎందుకు రాలేదో త్వరలొ ఈ మహిమగల పెన్ ఆన్లైన్ లో కూడా దర్శనమిస్తుందేమో వేచి చూద్దాం.

To Top

Send this to a friend