పార్టీ నాదే.. పవరూ నాదే.. నాన్న పార్టీకి మెంటర్: అఖిలేష్

up_mulayam-singh-yadav-akhilesh

ఒకే దెబ్బకు చాలా పిట్టలు.. తండ్రి యాక్షన్ కు.. తనయుడి రియాక్షన్ మామూలుగా లేదు.. యూపీలో అధికార సమాజ్ వాదీ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. యూపీ సమాజ్ వాదీ పార్టీ నుంచి తనను బహిష్కరించిన నాన్న ములాయం సింగ్ యాదవ్ చర్యకు అదిరిపోయే జవాబిచ్చారు యూపీ సీఎం అఖిలేష్.. ఏంగా దాదాపు 200 మంది ఎమ్మెల్యేలు, సీనియర్ మంత్రులు, 35 మంది ఎమ్మెల్సీలు, కార్యకర్తలతో భారీ కార్యనిర్వాహక సమావేశం నిర్వహించి నాన్నను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తీసేశారు. ములాయంను పార్టీకి మెంటర్ గా చేసి విగ్రహంలా ఉండేలా సమావేశంలో నిర్ణయించారు. దాంతో పాటు పార్టీ కర్తకర్మ క్రియ అన్ని పదవులను, నిర్నయాధికారాలు తనే తీసుకునేలా సమావేశంలో నిర్ణయించారు. దీంతో ఇప్పుడు తండ్రి ములాయం, తనయుడు మధ్య వార్ ముదిరిపాకానపడింది.. ఈ పరిణామాలతో ములాయంతో పాటు బాబాయి శివలాల్ యాదవ్ ను కూడా సమాజ్ వాదీ పార్టీ నుంచి అఖిలేష్ పక్కకు పెట్టినట్టైంది. దీంతో ఇప్పుడు పవరూ, పార్టీని టేకోవర్ చేసుకొని అఖిలేష్ యూపీ రాజకీయాల్ని ఆసక్తికరంగా మార్చారు. ఎక్కువ శాతం మంది ములాయం కంటే అఖిలేష్ కు మద్దతు తెలపడంతో ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ పరమైంది.

To Top

Send this to a friend