పవన్ ప్రత్యేక హోదాపై దేశ్ బచావో: పవన్

ప్రత్యేక హోదా సాధన కోసం పవన్ పోరుబాటకు శ్రీకారం చుట్టారు. విశాఖ ఆర్కే బీచ్ లో యువత, పవన్ ఫ్యాన్స్, యువజన సంఘాలు తలపెట్టిన ప్రత్యేక హోదా ఆందోళనలకు మద్దతుగా దేశ్ బచావో అంటూ తన పాత సినిమా పాటను తీసుకొని హోదాపై తాను మాట్లాడిన డైలాగును ఏర్చికూర్చి రీమిక్స్ చేసి ట్విట్టర్ , యూట్యూబ్ లలో విడుదల చేశారు. ఇప్పటికే పవన్ ప్రత్యేక హోదాపై పలు ట్వీట్లు విడుదల చేసి హోదాపై పోరాడాలని చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా యువత ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొనాలని జనసేన పార్టీ ఓ మ్యూజిక్ ఆల్బమ్ ను విడుదల చేసింది.. ఈ ఆల్బమ్ కు సంబంధించిన పోస్టర్ ను పవన్ ఇప్పటికే తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ ఆల్బమ్ లో జనసేన వేర్పాటు వాద రాజకీయాలకు, నేర రాజకీయాలకు వ్యతిరేకంగా తన వాయిస్ వినిపిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పవన్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రత్యేక హోదాపై పలు పోరాట కవితలను రాసుకొచ్చారు. శేషంద్ర రాసిన కవితలను ఊటంకిస్తూ వాటిని పోస్టు చేశారు. ట్విట్టర్ పవన్ పెట్టిన ఇన్ స్పిరేషన్ కవితలు కింద చూడొచ్చు..

To Top

Send this to a friend