పవన్ గురించి.. ఆ మెగా హీరో కామెంట్


చిరు ఖైదీనంబర్ 150 మూవీ కానీ.. నిహారిక మూవీ కానీ పవన్ అభిమానులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. ఆడియో వేడుక అయినా.. సక్సెస్ టూర్ అయిన పవన్ అభిమానులు పవన్ కోసం నినాదాలు చేస్తూనే ఉంటారు. ఈ తతంగం ముదిరి అప్పట్లో ఓ ఆడియో ఫంక్షన్ లో నాగబాబు పవన్ అభిమానులపై మండిపడ్డారు.. మరో ఫంక్షన్ లో అల్లు అర్జున్ పవన్ గురించి ‘చెప్పను బ్రదర్ ’ అంటూ ఆవేశపడ్డారు. ఈ ఆవేశానికి చాలా సార్లు మూల్యం చెల్లించుకుంటున్న అల్లు అర్జున్.. ఇప్పటికీ పవన్ పై కామెంట్స్ విషయంలో దెబ్బైపోతున్నాడు.

ఇక వీరందరికి పవన్ అభిమానుల నుంచి వ్యతిరేకత రావడంతో చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మాత్రం చిన్న మావయ్య పవన్ విషయంలో స్పందించమంటే చాలా లౌక్యంగా మాట్లాడారు. ‘‘ పవన్ గురించి తానేమీ విమర్శించనని.. తాము ఈ స్థితిలో ఉన్నామంటే దానికి చిరు, పవన్ లే కారణమని.. వారి వారసత్వమే తమ సినిమా ఎంట్రీకి కారణమని పవన్ ను, చిరును పొగిడి’’ తనపై విమర్శలు రాకుండా భలే కవర్ చేశాడు. పవన్ గురించి ఎలాంటి తప్పుడు ప్రకటనలకు పోకుండా మావయ్య గ్రేట్ అంటూ తప్పించుకున్నాడు..

To Top

Send this to a friend