పవన్ కు తమ్ముడి బహుమానం..


పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కు తమ్ముడి నుంచి అరుదైన బహుమానం లభించింది.. కాటమరాయుడు సినిమాలో వపన్ నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా నటిస్తున్నాడు.. ఆ నలుగురు ఒక తమ్ముడే హీరో శివబాలాజీ.. సినిమా షూటింగ్ జరుగుతుండగా శివబాలాజీ పవన్ కోసం ఓ సర్ ప్రైజ్ బహుమతి తీసుకొచ్చాడు. స్కార్ఫ్ లో చుట్టి తీసుకొచ్చిన ఈ కానుక ను మోకాళ్లపై నిల్చొని పవన్ కు ప్రేమగా అందజేశారు. చిరునవ్వుతో అందుకున్న పవన్ దాన్ని ఓపెన్ చేయగానే.. అందులో బంగారపు రంగులో ఉన్న ఒక కత్తి ఉంది. పవన్ దాన్ని ఆసక్తిగా చూశారు. కత్తిపై రెండు వైపులా జనసేన పేరు తెలుగు హిందీ భాషల్లో రాసుంది. కత్తి పిడి వద్ద జనసేన లోగోను ముద్రించారు. శివబాలాజీ ఇచ్చిన కానుకపై కాటమరాయుడు బృందం ఫొటోలను విడుదల చేసి అభిమానులతో పంచుకుంది..

పవన్ కాటమరాయుడు సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొని ఉగాది కానుకగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. తమిళ వీరమ్ మూవీకి రిమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవన్ ఫుల్ మాస్ హీరో పాత్రలో కనిపిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కిషోర్ పార్థసాని దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు..

To Top

Send this to a friend