పవన్ కు ఇది ప్రతిష్టాత్మకం.

పవన్ కళ్యాణ్ కు ప్రతిష్టాత్మక అవకాశం వచ్చింది.. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించే అరుదైన అవకాశం వచ్చి దాని కోసం పవన్ అమెరికా చేరుచుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో ఆయన బోస్టన్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 7.40కి అడుగుపెట్టారు. ఈనెల 9 నుంచి 12 వరకు పవన్ వివిధ సమావేశాల్లో పాల్గొనడంతోపాటు వివిధ రంగాల ప్రముఖులు, శాస్త్రవేత్తలు, ఐటి నిపుణులతో భేటి అవుతారు. పదో తేదిన అమెరికా కాంగ్రెస్ సభ్యులు, సెనెటర్లు, అమెరికా న్యూక్లియర్ పాలసీ రూపకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.

11న ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ‘బికమింగ్ జనసేనాని’ అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు రాత్రి పవన్ కల్యాణ్ గౌరవార్థం హార్వర్డ్ యూనివర్సిటీ డీన్ నితిన్ నోహ్రియా తాజ్ బోస్టన్ లో ఇచ్చే విందులో పవన్ పాల్గొంటారు..
12న కూడా పవన్ హార్వర్డ్ యూనివర్సిటీలో నోట్ ప్రసంగం చేస్తారు. అందరికీ అరగంట సమయం ఇచ్చిన నిర్వాహకులు పవన్ కోసం గంట సమయాన్ని కేటాయించడం గమనార్హం. పవన్ తో పాటు సమావేశాల్లో పాల్గొనడానికి భారత్ నుంచి వచ్చిన ఎస్ వై ఖురేషి, ఒమర్ అబ్దుల్ల, కృష్ణ బైరేగౌడ, శశిథరూర్, గురురాజ్ దేశ్ పాండే, నితిన్ నోహ్రియా తదితరులతో భేటి అవుతారు.. సాయంత్రం ఆరున్నర గంటలకు బోస్టన్ నుంచి హైదరాబాద్ కు పవన్ కళ్యాన్ తిరుగు పయనమవుతారు..

To Top

Send this to a friend