పవన్ కు అవార్డు ఇవ్వకుండా బాబు ప్రతీకారం


ఏపీ ప్రభుత్వం నంది అవార్డుల్లోనూ రాజకీయాలు చేసిందా.? లేకపోతే అందరూ మెచ్చిన.. చాలా అవార్డులు వచ్చిన చిత్రాలను కాదని.. ఎవ్వరూ ఊహించని వాటికి అవార్డులు ఇచ్చారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. నంది అవార్డుల ఎంపికలో రాజకీయాలు నడిచాయనది జ్యూరి సభ్యులు అంతర్గత విషయాల్లో వెల్లడించారు.

2012,13 సంవత్సరాలకు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో రాజకీయాలు, స్వప్రయోజనాలను బట్టే చిత్రాల ఎంపిక జరిగింది. రాజకీయా కక్ష్యలతో కొన్ని మంచి చిత్రాలకు అవార్డులు రాలేదు. బెస్ట్ యాక్టర్ గా అద్భుతంగా నటించిన పవన్ కళ్యాణ్( అత్తారింటికి దారేది), మహేశ్ బాబు(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)లను కాదని.. ప్రభాస్ ను బెస్ట్ యాక్టర్ గా జ్యూరి ఎంపిక చేయడంపై టాలీవుడ్ పరిశ్రమనే విస్మయం వ్యక్తం చేసింది.. అస్సలు మిర్చి మూవీ కానీ, ప్రభాస్ కానీ అందులో నటనకు అవకాశమే లేదు.. అసలు జ్యూరి సభ్యులు పవన్ కళ్యాణ్ (అత్తారింటికి దారేది) ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేయాలని జ్యూరి సభ్యులు నిర్ణయించారట.. కొంతమంది మహేశ్ బాబుకు మొగ్గు చూపారట.. వీరిద్దరు ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తుండడంతో వారికి అవార్డులు ఇవ్వరాదని ఏపీలోని ముఖ్యులనుంచి ఆదేశాలు వెల్లాయట.. దీంతో జ్యూరి చివరకు ప్రభాస్ ను మిర్చి చిత్రానికి ఎంపిక చేసి చేతులు దులుపుకుంది.. ఉత్తమ చిత్రంగా సీతమ్మ వాకిట్లో లేదా అత్తారింటికి ఎంపిక చేస్తారని భావించినా మిర్చిని ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది..

మొత్తంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో అర్హులైన సినిమాలకు, హీరోలకు తీవ్ర అన్యాయం జరిగింది. అందరూ ఊహించిన అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సినిమాలను కాదని మిర్చికి అవార్డుల పంట పండించడం వివాదాస్పదమైంది. రాజకీయంగా పవన్ పోటీదారుగా మారడంతో ఆయన సినిమాను, ఆయన్ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేయలేదని టాక్ వినిపిస్తోంది..

To Top

Send this to a friend