పవన్ కళ్యాణ్ అభిమానిని : యువ కథానాయకుడు సందీప్

bhavya-sri-nenu-seethadevi-movie
పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో సినిమా పరిశ్రమలోకి వచ్చానని…పవర్ స్టార్ అభిమానులు తనను ఆదరించాలని కోరుతున్నారు  ఆయన హీరోగా నటించిన నేనూ సీతాదేవి ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. సుమారు వంద థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొస్తోందీ సినిమా. హార్రర్ లవ్ స్టోరీ తో యువతను ఆకట్టుకునే అంశాలతో పుష్కలమైన వినోదాన్ని అందించేలా నేనూ సీతాదేవి తెరకెక్కింది. శ్రీనివాస్ మల్లం దర్శకుడు. కోమలి, భవ్య శ్రీ నాయికలుగా నటించారు. సందీప్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ వెంకన్న నిర్మాణ బాధ్యతలు వహించారు. నేనూ సీతా దేవి విడుదల సందర్భంగా చిత్ర కథానాయకుడు సందీప్ మాట్లాడుతూ…పవన్ కళ్యాణ్ నటన చాలా ఇష్టం. ఆయన సినిమాల ప్రభావంతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను కథానాయకుడిగా నటించిన తొలి సినిమా నేనూ సీతాదేవి ఈనెల 14న విడదులకు సిద్ధమవుతోంది. నాకు మొదటి సినిమా అయినా తోటి నటులు పేరున్న వాళ్లు కావడం కలిసొచ్చింది. జీవా, వెన్నెల కిషోర్ లాంటి నటులు కొత్తవాడినైనా నన్ను ప్రోత్సహించారు. ఓ స్నేహితుడిలా చూశారు. హార్రర్ లవ్ స్టోరీ ఇది. యూత్ ఫుల్ అంశాలుంటాయి. చైతన్య సంగీతం అందించిన పాటలు బాగా కుదిరాయి. వాటిని అందమైన లొకేషన్లలో చిత్రీకరించాం. సినిమా అంతా ఆహ్లాదకరంగా సాగుతుంటుంది. కుటుంబమంతా కలిసి చూసే సినిమా అవుతుంది. కథలో వచ్చే మలుపులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. కథ ఎలా ఉంటుందో అన్నది ఊహించకుండా కథనం సాగుతుంటుంది. క్లైమాక్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. నేను నటుడు కావాలన్నది మా నాన్న కల. ఆయన ప్రోత్సహాంతోనే హీరోను అయ్యాను. సందీప్ క్రియేషన్స్ పై మంచి ఛిత్రాలు చేయాలని అనుకుంటున్నాము. అన్నారు.

ఈ సినిమాకు సంగీతం చైతన్య, ఎడిటింగ్ శ్రీ, మాటలు చింతా శ్రీనివాస్, నేపథ్య సంగీతం సునీల్ కశ్యప్, ఆర్ట్ యాదగిరి, సినిమాటోగ్రఫీ శివాజీ

To Top

Send this to a friend