పవన్ కల్యాణ్ మీడియా సమావేశం: ప్రత్యేకతలు

మోదీ సమస్యను అర్థం చేసుకుంటారనుకున్నా,చంద్రబాబు అనుభవం ఉపయోగపడుతుందనుకున్నా:పవన్‌ కళ్యాణ్‌

ఏపీకి అన్యాయం జరుగుతుందని చెప్పిఓట్లు వేయించుకున్నారు,మీ ఇష్టానికి మీరు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోవాలా:పవన్‌కళ్యాణ్‌

హోదా సంజీవనా, మరచిపోయిన అధ్యాయం అంటున్నారు, ఏపీలో టీడీపీ-బీజేపీ ప్రభుత్వంలా తయారైంది:పవన్‌కళ్యాణ్‌

చంద్రబాబు పరిపాలనా అనుభవం చూసే ఆ రోజు మద్ధతిచ్చాను:పవన్‌కళ్యాణ్‌

ప్రత్యేకహోదాపై ఎందుకు రాజీపడ్డారో చంద్రబాబే చెప్పాలి:పవన్‌కళ్యాణ్‌

భయపెట్టి పరిపాలిస్తానంటే ఎలా, అధికారంలో ఉన్నాం, ఏమైనా చేస్తామంటే కుదరదు:పవన్‌కళ్యాణ్‌

రాయపాటి లాంటి అభియోగాలున్న వారిపై నిపుణులు కమిటీ వేయాలి, పాలన సరిగా లేనప్పుడు నిరసనలు వస్తాయి:పవన్‌కళ్యాణ్‌

పచ్చని పంట పొలాల్లో మట్టిని తెచ్చిపోస్తున్నారు, పోలవరం ప్రాజెక్ట్‌లో ఎన్నో అవకతవకలు ఉన్నాయి:పవన్‌కళ్యాణ్‌

మీరు ఇలాగే ఉంటే మేం కూడా ఉంటే ఉంటాం, పోతే పోతాం అనే స్థాయికి వస్తాం:పవన్‌కళ్యాణ్‌

స్పెషల్‌ ప్యాకేజీ అర్ధరాత్రి ఇవ్వాల్సిన అవసరం ఏంటి, రావాల్సిన నిధులకే ప్రత్యేక ప్యాకేజీ ముసుగు వేశారు:పవన్‌కళ్యాణ్‌

పోలవరంపై అనంతపురం సభలో వేసిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం రాలేదు:పవన్‌కళ్యాణ్‌

దక్షిణాది వారు అన్ని చూస్తూ ఊరుకోరు,బానిసలుగా భావిస్తున్నారేమో, తిరగబడితే ఏం జరుగుతుందో చూస్తాం:పవన్‌కళ్యాణ్‌

ఉత్తరాది, దక్షిణాది అనే పదాలను కావాలనే మాట్లాడాను, దక్షిణాదిలో ఓ రాష్ట్రాన్ని 12 గంటల్లో విడదీస్తారా, 1400 మంది యువత చనిపోతె జాతీయ మీడియలొ వార్త అవుతుంది. ఆదె ఉత్తరాది రాష్ట్రాలలొ తుమ్మినా, ఎవరన్నా కాలుజారి పడిపొయిన వార్త అవుతుంది. ఈ వివక్ష ఎందుకు? దక్షినాది విషయాలు కుడా భారతదెశంకి సంబంధించినదె కదా?:పవన్‌కళ్యాణ్‌

ప్రజల కోసం సొంత కుటుంబం, అన్నయ్యతో విభేదించి వచ్చా. ప్రజలకు మేలు జరగనప్పుడు మీ పక్షాన నేనెందుకు ఉండాలి: Pawan Kalyan

To Top

Send this to a friend