పవన్ ఉండగా.. అభిమాన సంద్రం అండగా..

uddanam-pawankalyan

అభిమానం వేరు.. ఆక్రోశం వేరు.. పట్టుదల వేరు.. ఉద్యమం వేరు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ది పేదలకు మంచి చేయాలనే ఆక్రోశం.. వారి బతుకుల్ని ఉద్యమించి అయినా బాగుచేయాలనే తపన.. అందుకే జనసేనాని ఉద్దానం బాధితులకు అండగా వచ్చినందుకు జననీరాజనం పలికారు. ఉద్దానం సమస్యను వెలుగులోకి తీసుకొచ్చాక జనసేనాని ఇచ్చాపురంలో నిర్వహించిన రోడ్ షోకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. ఇది పవన్ స్టామినాకు అద్దం పడుతోంది..
పవన్ రాజకీయాలు ఆశించి శ్రీకాకుళం రాలేదు.. కేవలం కిడ్నీ బాధితులకు అండగా.. వారికి బాగుచేద్దామని ఉద్దానంలో పర్యటించారు. ఒక మంచి పనిచేస్తే జనం ఎలా స్పందిస్తారో పవన్ పర్యటన మనకు ఉదాహరణ. పవన్ ఇచ్చాపురంలో కానీ ఉద్దానంలోకానీ పర్యటించినప్పుడు చంద్రబాబు, జగన్ అనుకూల మీడియా కూడా ప్రజా స్పందనకు తలవంచి ప్రత్యక్ష ప్రసారాన్ని కొనసాగించాయి. మంచి చేస్తే ప్రజల నుంచి, మీడియా నుంచి సపోర్టు వస్తుందని పవన్ పర్యటన నిరూపించింది..
తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసినందుకు ఉద్దానం బాధితుల కళ్లల్లో ఆనందభాష్పాలు పడ్డాయి. ఏపీ ఉమ్మడిగా ఉన్నప్పుడు.. విడిపోయినప్పడు.., ఓట్ల కోసం వచ్చిన నాయకులు సైతం ప్రస్తావించని అంశాలు పవన్ ప్రస్తావించడం అందరిలోనూ స్ఫూర్తిని పంచింది..

To Top

Send this to a friend