పవన్ ఆఫర్ ను మిస్ చేసుకున్న హర్షవర్ధన్

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలతో రచయితగా మంచి పేరుతెచ్చుకున్న రచయిత హర్షవర్ధన్ మంచి చాన్స్ మిస్ చేసుకున్నారు. పవన్ తాను త్వరలో తీయబోయే కొత్త చిత్రం తమిళ రీమేక్ వేదాలం ను తెలుగులో రిమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో రచనా బాధ్యతలు హర్షవర్దన్ ను చేయమని కోరాడట.. కానీ అప్పటికే రచయిత నుంచి దర్శకుడిగా మారి తన తొలిచిత్రాన్ని తీస్తున్న హర్షవర్ధన్ తనకు సమయభావం వల్ల పవన్ ఆఫర్ ను మిస్ చేసుకున్నారట..
తమిళ సూపర్ హిట్ వేదాలం ను పవన్ రిమేక్ చేస్తున్నారు. నేసన్ దర్శకుడు. ఏఎం రత్నం సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా రచన బాధ్యతలు హర్షవర్ధన్ వదులుకోవడంతో పవన్ యూనిట్ మరో రచయితను సంప్రదిస్తోందట.. కాగా హర్షవర్ధన్ కొత్త నటులతో ఓ చిత్రానికి దర్శకుడిగా చేస్తున్నారు. అది రన్ లో ఉండగానే.. సుధీర్ బాబు హీరోగా మరో సినిమాకు ఓకే చెప్పాడు. దీంతో ఈ రెండు చిత్రాలు ఉండడంతో పవన్ ఆఫర్ ను తీసుకోలేకపోయాడు హర్షవర్ధన్..

To Top

Send this to a friend