
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అమెరికా పరట్యన ఎవరున్నారు..? ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించే అవకాశం ఎలా వచ్చింది..? ఇండియాలో ఇంతమంది ప్రముఖులు ఉండగా పవన్ నే ఎందుకు ఆహ్వానించారు..? కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా, ఫిల్మ్ మేకర్ దీపామెహతా.. మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే ఇంకా చాలామంది దిగ్గజాలు హాజరవుతున్న ఈ ఇండియా కాన్ఫరెన్స్ 2017లో పవన్ ప్రత్యేక ఆకర్షణ వెనుక ఎవరున్నారనే ప్రశ్న తెలుగు నాట హాట్ టాపిక్ అయ్యింది..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి పనులు, సేవానిరతి, రాజకీయాల్లో పేదల విషయంలో తొందరగా స్పందించి వారి వెంట నిలవడం.. తదితర పనులే ఆయన్ను ఈ స్తాయికి తెచ్చాయి. కొన్నాళ్ల కిందట కాకినాడలో బీజేపీ వ్యతిరేక సభ పెట్టిన పవన్ కళ్యాణ్ ఆరోజు ప్రముఖ డాక్టర్ చంద్రశేఖర్ రావు చేస్తున్న ఉచిత సేవలకు కరిగిపోయి ఆయన వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించారు. సంకురాత్రి ఫౌండేషన్ పేరుతో సంస్థను స్థాపించి చంద్రశేఖర్ రావు 25 ఏళ్లు ఉచితంగా కంటిచికిత్సలు.. పేద పిల్లలకు చదువు చెప్పిస్తూ ఆ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. అప్పుడు పవన్ డా. రావును ఆయన చేస్తున్న మంచి పనులను అభినందించారు. మీలాంటి వారితో కలిసి పనిచేస్తామని చెప్పారు. దీనికి ఓకే అని డా. రావు కూడా పవన్ ను అభినందించారు.
కాగా అక్కడికి కట్ చేస్తే.. ఇండియా కాన్ఫరెన్స్ 2017 పేరిట అమెరికాలో ఈనెల 11నుంచి నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ నిర్వహణలో సంకురాత్రి ఫౌండేషన్ కూడా ఒక స్పానర్ గా వ్యవహరిస్తోంది. ఇక్కడ పవన్ చేస్తున్న సేవలు.. రాజకీయ పార్టీగా క్రియాశీలక పనులు, సేవలకు గాను పవన్ ను అమెరికా కాన్ఫరెన్స్ లో ప్రసంగించేలా ఈ ఫౌండేషన్ సిఫారసు చేసిందని.. దానికి హార్వర్డ్ యూనివర్సిటీ అంగీకారం తెలిపి పవన్ ను ఆహ్వానించినట్టు తెలిసింది..
* అమెరికాన్ రాజకీయ వ్యూహకర్త స్టీవ్ జార్జింగ్ తో పవన్ భేటి..
స్టీవ్ జార్జింగ్.. అమెరికాలోని ఫేమస్ రాజకీయ వ్యూహకర్త.. ఈరోజు ఉదయం పవన్ ను కలిసి సుధీర్ఘంగా చర్చలు జరిపారు. బోస్టన్ లోని హోటల్ లో పవన్ ని జార్జింగ్ కలుసుకున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కెనెడీ స్కూల్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జార్జింగ్ కు పబ్లిక్ పాలసీ, రాజకీయ వ్యూహాల రూపకల్పనలో ఆరితేరారు. అమెరికాలోని దిగ్గజ రాజకీయ నేతలకు, భారత్ లోని సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కు జార్జింగ్ సలహాలు.. సూచనలను అందిస్తున్నారు.. ప్రస్తుతం యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం జార్జింగ్ రూపొందించిన సలహాలను అఖిలేష్ యాదవ్ అమలు చేస్తున్నారు.
కాగా పవన్ తో రెండు గంటల పాటు జార్జింగ్ ఏకాంతంగా జరిపిన చర్చల్లో ఏపీలో 2019 ఎన్నికలు ఎలా వుండబోతున్నాయి.. అందులో ఎలాంటి ఎత్తుగడలు అవలంభించాలి.. అభ్యర్థుల ఎంపిక ఎలా..? లాంటి కీలక విషయాలను పవన్ తో జార్జింగ్ చర్చించారు. దీంతో రాజకీయంగా పవన్ ఏపీలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు అర్థమవుతోంది..
అనంతరం పవన్ న్యూక్లియర్ నిపుణుడు ప్ొరఫెసర్ మాత్యూబన్, ఎనర్జీ పాలసీ రూపకర్త హెన్రీలో తో పవన్ భేటి అయ్యారు.
