జనసేనాని దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు.

pawan-kalyan-visit-uddanam-victims-of-kidney-disease

ఏదైనా చేస్తే ప్రజలకు ఉపయోగపడాలా.. అప్పుడే చేసిన పనికి సార్థకత.. పవన్ కళ్యాణ్.. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల కష్టాలకు చలించి యట్యూబ్ లో వీడియో తీసి అందరికీ కనువిప్పు కలిగించారు. అనంతరం స్వయంగా అక్కడికి వెళ్లి బాధితుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలో కదలిక వచ్చింది.. సీఎం చంద్రబాబు శుక్రవారం స్వయంగా కదిలివచ్చారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ కోరిన విధంగా కిడ్నీ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ బృందం ఇక్కడ గతంలో జరిపిన పరిశోధనలో సిలికాన్ నీటిలో ఎక్కువగా ఉందని.. అందుకే కిడ్నీ బాధితులు పెరిగిపోయారని తెలిపిందని చంద్రబాబు సభలో చెప్పుకొచ్చారు. అందుకే ప్రతి గ్రామానికి మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ఆరోగ్య భద్రత, చంద్రన్నబీమా.. చంద్రన్న సంక్రాంతి కానుక, ఎన్టీఆర్ గృహ భద్రత, విద్యుత్ భద్రత, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలను ఉద్దానం కిడ్నీ బాధితులకు అందజేస్తామని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా ఉద్దానం ప్రాంతానికి తాగునీటి సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించదని తెలిపారు. ఇందుకోసం తాగునీటి పథకాన్ని చేపడుతున్నట్టు వెల్లడించారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పోరాటం వల్ల ఇప్పుడు ఉద్దానం బాధితుల కష్టాలు తీరాయి.. వారి చెంతకు ప్రభుత్వ అధినేత కదిలివచ్చి వారి సమస్యలు తీర్చాడు. ఇలా పవన్ చేసిన ఓ మంచి పని చాలామంది బాధితులకు ఉపశమనం కలిగించింది.

To Top

Send this to a friend