పన్నీర్ సెల్వం హీరో.. చంద్రబాబు జీరో..

ఎంత పరపతి ఉంటే ఏం లాభం.. పనులు చేస్తేనే గౌరవం.. పరపతి ఉండాలి.. ఆ విషయంలో తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంను మెచ్చుకోవాల్సిందే.. పన్నీర్ కు, కేంద్రంలోని బీజేపీ పెద్ద మోడీకి అస్సలు సాన్ని హిత్యమే లేదు.. అయినా జల్లికట్టు ఉద్యమం మొదలవగానే ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని ఒప్పించి ఏకంగా ఆర్డినెన్స్ ను తీసుకొచ్చారు పన్నీర్ సెల్వం.. అందుకే పన్నీర్ ఇప్పుడు తమిళనాడులో శభాష్ అనిపించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉండి మోడీతో చాయ్ తాగేంత క్లోజ్ నెస్ ఉన్న చంద్రబాబు మాత్రం ఏం చేయలేకపోతున్నారు. ఏంటీ గ్రహపాటు..

ఎన్నికల ముందు బీజేపీ,టీడీపీ అంటకాగింది. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలో కి వచ్చారు. అంతా క్లోజ్ గా ఉన్న చంద్రబాబును మోడీ సాంతం వాడుకుంటున్నారు. నోట్ల రద్దు పై కేంద్రం కమిటీ వేస్తే దానికి చంద్రబాబునే చైర్మన్ ను చేశారు ప్రధాని మోడీ. ఇందులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, సిక్కిం తదితర రాష్ట్రాల సీఎంలను చంద్రబాబుకు కింద సభ్యులుగా చేశారు. బాబు, ఇతర రాష్ట్రాల సీఎంల నేతృత్వంలో నివేదిక రూపొందించి పెద్ద నోట్ల కష్టాల తొలగింపుపై మంగళవారం పీఎంకు నివేదిక ఇచ్చారు. బాగానే ఉంది. అంతా పేరు, ప్రఖ్యాతలు ఉన్న బాబు.. కేవలం ఆంధ్రుల బలమైన కోరికను నెరవేర్చడం లో దారుణంగా విఫలమవుతున్నారు. అదేదో ఆంధ్రుల కోరిక కాదు.. స్వయంగా తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ, చంద్రబాబులు ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీ ఇది.. అయినా దాన్ని నెరవేర్చడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. అదే తమిళుల కోసం, తమిళ మనోభావాల కోసం పక్కరాష్ట్రం సీఎం పన్నీర్ సెల్వం ఢిల్లీకి పోయి అనుకున్నది సాధించారు. మరి చంద్రబాబు ఎందుకు అలా చేయరు.? కేంద్రంలో ఆయనకు పరపతి లేదా అన్న సందేహాలున్నాయి..? అందుకే పన్నీర్ విజయం చూశాకా బాబు వేస్ట్ అంటున్నారు ఏపీ ప్రజలు..

To Top

Send this to a friend