పక్షుల మృతి వెనుక రహస్యం!!


మండుతున్న ఎండల తీవ్రతను ఎలా వివరించాలనే ఆసక్తి సోషల్ మీడియా వాడుతున్న కొందరు సభ్యులను తీవ్ర గందరగోళానికి దారితీయించింది. ఏదైనా ఒక ఫొటో కానీ వీడియో కానీ వదిలితే దాన్ని అందరూ షేర్ చేస్తూ ఎక్కడికో తీసుకెళ్తారు.. అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే దాని తీవ్రతకు అందరూ అయ్యో అనేలా చేస్తారు….

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. జనాలకు తాగడానికి చుక్క నీరు కరువైంది.ఈ సమయంలో మూగజీవాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పక్షలకు నీళ్లు దొరక్క చనిపోతున్నాయట.. అలా కరువు పీడిత మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో పక్షులు నీళ్లు లేక వందల సంఖ్యలో చనిపోయిన దృశ్యం వాట్సాప్ లో తెగ హల్ చల్ చేస్తోంది. దానికి టాగ్ గా లాతూర్ లో నీళ్లు లేక పక్షలు చనిపోయాయని.. కాస్త మీ పెరిట్లో, మీ ఇళ్లపైన గ్లాసులో నీళ్లు పోసిపెట్టండి.. పిట్టల్ని కాపాడండి..’ అని వ్యాఖ్య పెట్టారు.

నిజానికి ఈ ఫొటో ఫేక్.. ఏడేళ్ల క్రితం బీహార్ లో పంటలకు అధిక మోతాదులో వేసిన క్రిమి సంహారక మందులు తిని ఈ పక్షులన్నీ చనిపోయాయట.. ఆ ఫొటోను మహారాష్ట్రలోని లాతూరు కరువుకు అంటగట్టి పక్షుల కోసం నీళ్లను అందరూ మానవతా దృక్పథంతో ఇళ్లపైన పెట్టండి అని వాట్సాప్, ఫేస్ బుక్ లలో షేర్ చేస్తున్నారు. ఇక్కడ లక్ష్యం మంచిదే అయినా.. ఆ ఫొటో మాత్రం అసలుది కాదనేది వాస్తవం..

To Top

Send this to a friend