పందిపిల్లతో సినిమానా..? రవిబాబు మరో వినూత్న ప్రయత్నం..

adhugo-ravibabu-apnewsonline

అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసిన ఆ పందిపిల్ల మెడపై కత్తిపెట్టడం చూసి అందరూ షాక్ అయ్యారు.. దర్శకుడు రవిబాబు చేసిన ఈ పనికి ఫీలవుతున్నారు.. సినిమాలు తీయడంలో ఆదినుంచి విభిన్నంగా, వినూత్నంగా వెళుతున్న దర్శకుడు రవిబాబు.. ఈ సారి పందిపిల్లతో కలిసి ‘అదుగో’ అనే సినిమాను తీస్తున్నారు. వచ్చే సమ్మర్ కు సినిమాను రిలీజ్ చేస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో పందిపిల్ల మెడపై కత్తి.. దానిపై దిస్ సమ్మర్ అని రాసి ఉంది.. దీనర్థం తెలియక రచయితలు, నెటిజన్లు ఏం రాయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
రవిబాబు అంటే నే వెరైటీ.. వెరైటీ సినిమాలు తీయడమే ఆయన పని.. అల్లరితో అలరించాడు. అనంతరం అమరావతి, అనసూయ, అవును లాంటి థ్రిల్లింగ్ హర్రర్ మూవీలు తీసి భయపెట్టాడు. సక్సెస్ కోసం కాకుండా తన అభిరుచికి తగ్గట్టు కొత్తదనం జోడించి సినిమాలు తీసి అలరిస్తున్నాడు.. ఈ మధ్య కొంత కాలంగా తెల్లటి పంది పిల్లను పెంచుకుంటున్నాడు. ఇంటర్వ్యూల్లో.., ఏటీఏంల వద్ద క్యూలో కూడా పందిపిల్లను చంకలో పెట్టుకొని కనిపించాడు. ఇప్పుడు అదే పందిపిల్లను హీరోను చేసి ఏకంగా సినిమాను తీస్తున్నాడు.. ‘అదుగో’ పేరుతో రూపొందే ఈ సినిమా పోస్టర్ కు క్రేజ్ వచ్చింది. జ్యోతి లక్ష్మీ సినిమాలా కనిపించి కనిపించకుండా.. అర్థం అయ్యి కానట్టు ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో మరోసారి ఆసక్తిని పెంచింది. సినిమా విడుదల అయితే కానీ అది కామెడీ మూవీనా.. హర్రర్ మూవీనా చెప్పే పరిస్థితిలో ఎవరూ లేరు..

To Top

Send this to a friend