నోబెల్ కు బాబు టెండర్.. 100 కోట్లు పక్కా

chandrababu-apnewsonlinein

‘సెకెట్రీ కుసింత కళాపోసన ఉండాలయ్యా.. అది రాజకీయాలైనా.. సినిమా ఇండస్ట్రీ అయినా.. ఎక్కడ వాడాలో తెలిసినవాడే మొగోడు.. ’ ఆ విషయంలో మన చంద్రబాబు మొనగాడు.. బాబు కు అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో తెలియదు.. దేశం మొత్తం మీద ఒక్క ఒలంపిక్ కాస్యం, రజతం వస్తేనే సంబరాలు, కోట్లలో పారితోషికాలు ఇస్తున్న దేశంలో ఒలంపిక్ స్వర్ణం కానీ, నోబెల్ ప్రైజ్ కానీ వస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే ఆత్రుత గా ఉంటుంది. మన ప్రభుత్వాలు, వ్యక్తులు వారిపై ఎలాంటి వరాల వాన కురిపిస్తారోనన్న ఆసక్తి నెలకొంది..
తిరుపతి లో జరుగుతున్న బాలల సైన్స్ కాంగ్రెస్ లో అదే జరిగింది. దేశం మొత్తం మీద ఒక్కరైనా నోబెల్ బహుమతి సాధించలేక ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రోజులివి. ఎందుకంటే పరిశోధనలు లేక.. మన విద్యావ్యవస్థ అంతా కుంటుపడి సాగిలపడుతున్న ఈ దేశంలో నోబెల్ బహుమతిని అంత త్వరగా ఊహించడం కష్టమే.. ఉన్న దేశంలోని మేధావులు కూడా మేధోవలస అవకాశాల కోసం విదేశాలకు చెక్కేసి ఆ దేశాల తరఫున నోబెల్ లు కొల్లగొడుతున్నారు.. ఇలాంటి పరిస్థితిలో ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోని మేధావులకు, పరిశోధకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నోబెల్ బహుమతి సాధించే తొలి వ్యక్తికి ఏకంగా 100 కోట్లు నజరానా ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించాడు. దేశం మొత్తం ఎంత కసరత్తు, పరిశోధనలు చేసినా సాధ్యం కాని నోబెల్ బహుమతిని అదీ మౌళిక సౌకర్యాలకే తండ్లాడుతున్న ఏపీ నుంచి అందుకోవాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. అప్పటికి చంద్రబాబు మనవడు దేవాన్స్ ముఖ్యమంత్రిగా ఉంటాడేమో.. చంద్రబాబు తన పీరియడ్ లో ఎలాగూ నోబెల్ సాధించడం కల్లా అని తెలుసు కనుకే ఇలా ప్రకటించారని విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు..

To Top

Send this to a friend