నేషనల్ మీడియతో పవన్.. మోడీకి అర్థం అవ్వాలిగా!

దక్షిణాది బాధలను.. ఇక్కడి ఉద్యమాలను నేషనల్ మీడియా పట్టించుకోవడం లేదంటూ వాపోయిన పవన్.. ఢిల్లీలో ఎవరు దగ్గినా, తుమ్మినా దాన్ని దేశం మొత్తం వార్తగా భ్రమింపచేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు జనసే కార్యాలయంలో జరిగిన సమావేశంలో పవన్ నేషనల్ మీడియా వ్యవహరిస్తున్న తీరు.. దక్షిణాది వార్తలు, ఉద్యమాలు, సంచలనాలను పట్టించుకోని తీరును ఎండగట్టారు. 1500 మంది చనిపోయాక తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించారని.. ఇప్పుడు ఏపీ ఉద్యమాన్ని సైతం ఇలాగే గుర్తించడం లేదని వాపోయారు..

ఇక ప్రధాని నరేంద్రమోడీకి హోదా పై గట్టిగా చెప్పేందుకు పవన్.. తెలుగు మీడియాతో మాట్లాడిన అనంతరం నేషనల్ మీడియా ప్రతినిదులతో సమావేశమయ్యారు.. వారితో మోడీ హోదాపై వెంటనే తేల్చివేయాలని స్పష్టం చేశారు. మోడీ హోదాపై నాన్చుతూ ఏపీ ప్రజల ఆగ్రహాన్ని చూస్తున్నారని.. ప్రజలకు వెంటనే ఏపీకి హోదా ఇస్తామో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్ అభిమాతం ఇలాగైనా ప్రధానికి తెలుస్తుందని భావిద్దాం..

పవన్ నేషనల్ మీడియాతో జరిపిన ఇంటర్వ్యూ వీడియోను కింద చూడొచ్చు…

To Top

Send this to a friend