నేనూ పవన్ పార్టీనే..

మొన్న నాగబాబు.. నిన్న బండ్ల గణేష్.. ఈరోజు గుత్తా జ్వాలా ఇలా ఒక్కొక్కరు చేరిపోతామంటున్నారు. కొందరు మంత్రులమైపోతున్నామంటున్నారు. ఇంతకీ ఎవరిదీ ఆ పార్టీ.. ఎందుకు చేరుతున్నారు..? క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారా..? అంటే ఏదీ లేదు.. అంతా ఊహాగానాల మీదే ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు. అస్సలు ఆ పార్టీని నడిపించే పవన్ కళ్యాణ్ కే ఇంకా స్పష్టత లేదు.. కానీ ఇప్పటికే పార్టీలో చేరతామంటూ ఊదరగొడుతున్నారు.

పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమనుకుంటున్నారు. దీంతో అందరూ వెయిట్ చేస్తున్నారు. తమ సీట్లకు ఖర్చీఫ్ వేసుకుంటున్నారు. మొదట దీనికి ఆజ్యం పోసింది పవన్ అన్నయ్య నాగబాబు.. ఆ తర్వాత నిర్మాత, నటుడు బండ్ల గణేష్.. వీరిద్దరు పవన్ 2019 ఎన్నికల్లో పోటీచేస్తారని.. ఖచ్చితంగా గెలుస్తాడని.. తమకూ ఓ సీటు ఇస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. జనసేన ఎంపీ , ఎమ్మెల్యే సీట్ల కోసం అప్పుడే అందరూ ఖర్చీఫ్ వేసుకొని రెడీ అవుతున్నారు. కానీ ఇంతకీ జనసేనాని నోరు తెరిస్తే కదా.. అసలు పోటీచేస్తారా లేదా వైదొలుగుతారా..? లేక వైసీపీకి మద్దతిస్తారా.. చంద్రబాబుతోనే కొనసాగుతారా అన్నది తేలాల్సి ఉంది. ఆ తర్వాత ఈ సీట్ల ముచ్చటా..?

To Top

Send this to a friend