నేను క్షేమంగానే ఉన్నాను!

కొన్ని గంటల క్రితం సినీనటుడు-హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారని వార్తలు వచ్చాయి. అయితే.. యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే కానీ తనకు ఏమీ అవ్వలేదని నందమూరి బాలకృష్ణ తెలిపారు. 
తానే స్వయంగా కారు డ్రైవ్ చేస్తుండగా.. పూలమాల వచ్చి అద్దం మీద పడడంతో.. రోడ్డు సరిగా కనిపించక డివైడర్ ను గుద్దానని, కారు టైరు బ్లాస్ట్ అవ్వడం మినహా నష్టమేమీ జరగలేదని తెలిపారు. 
తండ్రి నందమూరి తారకరామారావు ఆశీస్సులు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు, అభిమానుల నాపై చూపించే ప్రేమే శ్రీరామరక్షగా తాను సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగానని బాలకృష్ణ పేర్కొన్నారు!
To Top

Send this to a friend