నేనుండగా.. లోకేష్ ‘బాబు’వద్దు..

చంద్రబాబు గుణమే అది.. నాటినుంచి నేటి వరకు ఆయన ఎవరినీ నమ్మరు.. అధికారంలోకి రావడానికి ఎంత దందా చేశాడో.. ఎన్నెన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగాయో బాబుకు తప్ప ఇంకెవరీ అంతగా తెలియదు.. ఆ విద్యలో చంద్రబాబు గారు ఆరితేరిపోయారని.. ఆయన చరిత్ర చూస్తే అర్థమవుతుందని ఆయన ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తుంటారు..

అది నిజమే.. ఓ పక్క పక్కరాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ తన కొడుకును ప్రొజెక్టు చేస్తున్నాడు. రాజకీయాల్లోకి ఎప్పుడో తెచ్చి ఎమ్మెల్యేను చేసి.. మంత్రి ని చేసి.. పార్టీ బాధ్యతలు అప్పగించి.. టీఆర్ఎస్ లో నంబర్ 2 పొజిషన్ ను కట్టబెట్టారు. కేటీఆర్ తలుచుకుంటే ఇప్పుడు జరగనది తెలంగాణలో ఏదీ లేదు.. అంతలా కేసీఆర్ కొడుకు రాజకీయాల్లో పాలనలో తనదైన ముద్రవేస్తున్నారు. కానీ చంద్రబాబు కొడుకు లోకేష్ ను మాత్రం ఇంకా రాజకీయాల్లో ఓనమాల దశలోనే ఉన్నారు. ఆయన బాబు లోకేష్ ను రాజకీయంగా పైకి లేపడానికి తటపటాయించడమే దీనికి కారణం..

కేసీఆర్ ముందుచూపుతో కేటీఆర్ ను ప్రొజెక్టు చేస్తుండగా.. చంద్రబాబు.. పార్టీలో, ప్రభుత్వంలో తనే ఉండాలని కోరుకుంటున్నాడు. తన ప్లేసులో లోకేష్ ను తీసుకురావడం చంద్రబాబుకు ఇష్టం లేదు. రాజకీయాల్లో తన నీడను కూడా నమ్మని చంద్రబాబు కొడుకు విషయంలో కూడా అదే స్ట్రాటజీని అమలు పరుస్తున్నారు. అందుకే టీడీపీ నాయకులు, లోకేష్ నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా ఆయన్ను రాజకీయాల్లో క్రియాశీలకంగా మార్చడం లేదు. ఎట్టకేలకు కొంత ఒత్తిడి రావడంతో లోకేష్ ను ఎమ్మెల్సీగా చేస్తున్నారు..

కాగా లోకేష్ ను ఎమ్మెల్సీగానే పరిమితం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. లోకేష్ ను రాబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా స్థానం కల్పించట్లేదని టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. లోకేష్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఇప్పుడే మంత్రి పదవి ఇవ్వవద్దని చంద్రబాబు సూచించారని తెలిసింది. ఈ విషయం బహిర్గతం కావడంతో లోకేష్ అభిమానులు, పార్టీ నాయకులు నిరాశలో మునిగిపోయారు.

2019 ఎన్నికల్లో చంద్రబాబు కేంద్రంగానే రాజకీయాలు కొనసాగాలని బాబు నిర్ణయించారట.. అందుకే లోకేష్ ను మంత్రిగా చేయడానికి నిరాకరించారట.. పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాలకే పరిమితం చేయాలని యోచిస్తున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో వన్ మ్యాన్ ఆర్మీలా ఉండాలనుకునే చంద్రబాబు.. తన కొడుకు విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తుండడం పార్టీ నాయకులనే విస్మయ పరుస్తోంది.

To Top

Send this to a friend