నేటికి 50 రోజులు.. మోడీ సాధించిందేంటి..?

demonetisation

సరిగ్గా 50 రోజులు.. దేశచరిత్రనే మార్చేసిన పెద్దనోట్లు రద్దు చేసి 50 రోజులు.. మోడీ పెద్దనోట్ల రద్దుతో ఏం సాధించారు..? విజయమా.. అపజయమా..? ఎవరికి లాభమైంది..? ఎవరు నష్టపోయారు..? ఇన్ని రోజులైన బ్యాంకుల ఎదుట పేదలు, ఖాతాదారుల క్యూలు ఎందుకున్నాయి..? చిల్లర కోసం రోడ్లపైనే జనం ఎందుకున్నారు.. వీటిన్నింటికి ప్రజలే సమాధానాలు చెప్తున్నారు.
పెద్దనోట్లు రద్దు చేయడం వల్ల బడాబాబులు ఇబ్బంది పడింది ఇప్పటివరకు లేదు.. టీడీపీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో 180 కోట్ల పెద్దనోట్లు బయటపడడం ఎవరి నిర్లక్ష్యం.. ఓ వైపు నోట్లు దొరకక జనం ఇబ్బందులు పడుతుంటే కొత్తనోట్లు బడాబాబులకు ఎలా చేరాయి.. పెద్దనోట్ల రద్దుతో బడాబాబులు, బంగారం, భూముల కొనుగోళ్లకు మల్లారు. బినామీలతో బ్లాక్ ను వైట్ చేసుకున్నారు. కానీ పాపం పేదలే తమ సొమ్మునంతా బ్యాంకులో వేసుకొని బ్యాంకు వారి దయాదక్షిణ్యాల మీద నెలల తరబడి తిరుగుతూ నష్టపోతున్నారు.. ప్రతి గ్రామం, మండలంలో చూసినా ఇప్పుడు బ్యాంకుల ఎదుట నిలబడ్డ అమాయకుల గోస కనపడుతోంది..
ప్రణాళిక లేకుండా పెద్దనోట్లు ఎన్ని సార్లు రద్దు చేసినా ప్రయోగం వికటిస్తుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు… పేదల బతుకులతో బంతాటలాడుతున్న ఏలికలకు వారి ప్రాణాలు పోతున్నా పట్టవంటూ విమర్శిస్తున్నారు… నష్టనివారణకు కనీస చర్యలు చేపట్టిన ఈ పాలకులు ఉన్నంత కాలం ప్రజలే సమిధలు అనడంలో ఎలాంటి సందేహం లేదని మండిపడుతున్నారు.

To Top

Send this to a friend