‘నువ్వు నేను ఒసెయ్ ఒరెయ్’

శ్రీ మూవీ మేకర్స్ పతాకం పై రిమ్మలపూడి వీర గంగాధర్ నిర్మించిన సినిమా ‘నువ్వు నేను ఒసెయ్ ఒరెయ్’. ఈ చిత్రంతో రవిచంద్ర కన్నికంటి దర్శకునిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. నూతన కథనాయకుడు అరుణ్ మహి, అమీర్ పేట్ లో ఫేమ్ అశ్విని జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రవిచంద్ర కన్నికంటి ఓ చక్కటి లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. దాదుపు మూడు నెలలకి పైగా హైదరాబాద్, ఈస్ట్, వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. దాంతో పాటే పోస్ట్ పొడక్షన్ కూడా ముగించుకొని ఇటీవలే లహరి మ్యూజిక్ ద్వారా ఆడియోను విడుదల చేశారు ఈ చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా ముగిశాయి. సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా ఈ చిత్రానికి క్లీన్ ‘యు’ రేటింగ్ ఇచ్చారని దర్శకులు రవిచంద్ర ప్రకటించారు. అలానే వేసవి కానుకగా ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లుగా నిర్మాత తెలిపారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ స్టార్ కమీడియన్ 30 ఇయర్స్ పృధ్వీ ఓ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్-వాసు బొజ్జా, సంగీతం – సుమన్ జూపూడి, ఎడిటిర్-కె.రవిందర్ బాబు.

To Top

Send this to a friend