నిశ్చితార్థం అయ్యింది.. అది రవితోనా కాదా..?

సినిమా, వెండితెర సంగతులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కడపకు చెందిన లాస్య ఇంజనీరింగ్ పూర్తి చేసింది. బాగా చదివే అలవాటున్న లాస్య ఏకంగా గూగుల్ హైదరాబాద్ క్యాంపస్ లో ఉద్యోగం కొట్టేసింది. మంచి మాటకారి, అందం ఉన్న లాస్యను చూసిన కొందరు టీవీ నిర్మాతలు ఆమెకు యాంకర్ గా.. సీరియళ్లలో అవకాశం ఇచ్చారు. దీంతో గూగుల్ లో లక్షలు వచ్చే జీతాన్ని వదిలేసి యాంకర్ గా ప్రస్థానాన్ని మొదలు పెట్టింది లాస్య..
అనంతరం కాలంలో మరోయాంకర్ రవి తో కలిసి మొదట్లో మాటీవీ, మా మ్యూజిక్ లలో సందడి చేసింది. పలు రోమాంటిక్ పాటలలో కూడా లాస్య-రవి జంట నటించి రంజింప చేశారు.. చాలాకాలం వీరిద్దరు ప్రేమలో ఉన్నారని గుసగుసలు వినిపించాయి. ఏమైందో ఏమో కానీ కొద్దిరోజులుగా లాస్య-రవి జంట ఒక్కటిగా కనిపించడం లేదు. ఈటీవీలో ఢీ జూనియర్స్ ప్రోగ్రాం కలిసిన చేసిన తర్వాత వీరిద్దరు విడిపోయారనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఆ తరువాత వీరిద్దరు కలిసి చేసిన ప్రోగ్రాం లేదు. ఈ మధ్య జీతెలుగులో జబర్దస్త్ ఫేం చంటి లాస్యను రవితో ఎఫైర్ గురించి అడిగితే ఆమె సీరియస్ అవ్వడం చూశాక.. వీరిద్దరు విడిపోయారనే విషయం తేటతెల్లం అయ్యింది..

ఇక రవి ప్రస్తుతం లాస్యకు దూరంగా ఉంటూ పలు టీవీషోలల్లో హీరోయన్ కం యాంకర్ శ్రీముఖితో క్లోజ్ గా మూవ్ అవుతూ షోలు చేస్తున్నాడు.. వీరిద్దరి కెమిస్ట్రీ చూశాక.. రవి .. లాస్యతో విడిపోయి శ్రీముఖితో ఎఫైర్ పెట్టుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.. కాగా ఆదివారం యాంకర్ లాస్య తన సోషల్ మీడియా ఖాతాలో తన నిశ్చితార్థం అయిన ఫొటోను పెట్టి ఆనందం వ్యక్తం చేసింది.. ‘‘తనకెంతో ఎగ్జైటింగ్ గా ఉందని.. తన సోల్ మేట్ తో నిశ్చితార్థం కి రెడీ అవుతున్నా.. ఓ ప్రత్యేకమైన రోజు కోసం రెడీ అవుతుండడంతో ఎంతో ఆనందంగా ఉంది..’ అంటూ సోసల్ మీడియాలో రాసుకొచ్చింది. దీంతో ఆమె నిశ్చితార్థం జరిగిపోయిందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్త ప్రచారంలోకి వచ్చింది… అయితే పెళ్లి యాంకర్ రవితోనా కదా అన్న విషయాలను.. అసలు ఎవరితో నిశ్చితార్థం అయ్యిందన్న విషయాలను లాస్య సోషల్ మీడియాలో ప్రస్తావించకపోవడం గమనార్హం.

To Top

Send this to a friend