నివురుగప్పిన నిప్పు.. విశాఖ ఆర్కే బీచ్ లో టెన్షన్

ఏపీ అట్టుడుకుతోంది. నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉంది.. ప్రత్యేక హోదా కావాలంటూ ఈరోజు ఏపీలోని యువత, పవన్ జనసేన, వైసీపీ, నాయకులు తలపెట్టిన ఆందోళన తీవ్రస్థాయిలో ఉంది. విశాఖ పట్టణం, ఆర్కే బీచ్ లో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. వైజాగ్ నగరాన్ని పోలీసులు దిగ్బందించారు. అడుగడుగునా ఆంక్షలు విధించారు. కొందరు పవన్ ఫ్యాన్స్ హోదా డిమాండ్ ఉన్న టీషర్టులు ధరించి బీచ్ వైపు రాగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయించారు. బీచ్ రోడ్డు కు ఎవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం విశాఖ మొత్తం 144 సెక్షన్ విధించి పోలీసులు ప్రత్యేక హోదా ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. కానీ యువకులు ఏదో ఒక రూపంలో వచ్చి ఆందోళనలో పాల్గొంటున్నారు..

జనసేన పార్టీ అధినేత పవన్, వైసీపీ అధినేత జగన్  లు ఇచ్చిన పిలుపు మేరకు యువకులు, నాయకులు, హోదా ఆందోళనలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ అధినేత జగన్ ఈరోజు సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొననున్నారు. ఆయనను పోలీసులు అనుమతిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇక పవన్ పాల్గొంటారా లేదా అన్నది కూడా ఉత్కంఠే..

చంద్రబాబు, అండ్ కో ఈ ప్రత్యేక హోదా ఆందోళనలు పూర్తిస్థాయిలో అణిచివేస్తోంది. రేపు జరిగే అంతర్జాతీయ సీసీఐ సదస్సులను దృష్టిలో పెట్టుకొని జగన్ అయినా పవన్ అయినా ఏ నాయకుడు వచ్చినా కనీసం మీడియాను కూడా వైజాగ్ లో స్వేచ్ఛగా తిరగనీయకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. కానీ యువకులు ఎలాగైనా హోదా ఆందోళన చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ పరిస్థితి టెన్షన్ టెన్షన్ గా ఉంది..

To Top

Send this to a friend