‘నిర్మల కాన్వెంట్’ డిజిటల్ ట్రైలర్ రిలీజ్ చేసిన కింగ్ నాగార్జున

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘నిర్మల కాన్వెంట్‌’. ఈ చిత్రం డిజిటల్‌ ట్రైలర్‌ను కింగ్‌ నాగార్జున ట్విట్టర్‌లో రిలీజ్‌ చేశారు.

కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ – ”నిర్మల కాన్వెంట్‌ ఫ్రెష్‌ ప్యూర్‌ లవ్‌స్టోరీ. నాకు లవ్‌స్టోరీలంటే చాలా ఇష్టం. ఈ చిత్రం ద్వారా రోషన్‌ను హీరోగా పరిచయం చేయడం చాలా ఆనందంగా వుంది. గుడ్‌ లక్‌ రోషన్‌” అన్నారు.

‘నిర్మల కాన్వెంట్‌’కు సూపర్‌స్టార్‌ మహేష్‌ విషెస్‌ 

ఈ చిత్రం ట్రైలర్‌ను చూసిన సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘నిర్మల కాన్వెంట్‌’ టీమ్‌ని విష్‌ చేస్తూ ”నిర్మల కాన్వెంట్‌’ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌” అంటూ ట్విట్టర్‌ విషెస్‌ తెలియజేశారు.

కింగ్‌ నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రోషన్‌, శ్రేయా శర్మ హీరోహీరోయిన్లు కాగా ఆదిత్య మీనన్‌, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్‌, తాగుబోతు రమేష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: రోషన్‌ సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.

To Top

Send this to a friend