నిరుద్యోగులా మజాకా.. కేసీఆర్ పీచేముడ్..


నిరుద్యోగులు సాధించారు.. ఇది ఖచ్చితంగా నిరుద్యోగుల విజయమే.. అర్థం పర్థం లేని నిబంధనలతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడినందుకు వారి చేసిన పోరాటమే ఈ వాయిదా ఫలితం.. గురుకుల నోటిఫికేషన్ లో డిగ్రీ 60శాతం మార్కులు.. ఇక ఇంగ్లీష్ మీడియంలాంటి ఎన్నో కఠిన నిబంధనలు విధించి టీఎస్ఫీఎస్సీ ఈ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు.. దీంతో కేసీఆర్ లో కదలిక వచ్చింది.. విమర్శలకు జడిసి గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారాయన.. ఈ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో కమిటీని వేసి ఈ నిబంధనలు విరుద్ధమని తేల్చారు. అందుకే సైలెంట్ గా జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేశారు.

తెలంగాణ గురుకుల నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ అర్ధాంతరంగా రద్దు చేసింది. ఈ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన కొత్త అర్హత నిబంధనల్లో స్పష్టత లేదంటూ పాత నోటిఫికేషన్ ను పక్కన పడేసి కొద్దిరోజుల తర్వాత కొత్త నిబంధనలు తేలాకే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మరో కారణం కూడా రద్దు వెనుక వినిపిస్తోంది.. శిక్షణ సంస్థలు , నిరుద్యోగులు తమకు కోచింగ్ తీసుకునేందుకు , ప్రిపేర్ కావడానికి సమయం కావాలని టీఎస్పీఎస్సీని కోరాయట.. కోచింగ్ సంస్థల ఒత్తిడి కూడా ప్రభుత్వంపై ఉంది. అందుకే అర్ధాంతరంగా నోటిఫికేషన్ ను ప్రభుత్వం రద్దు చేసింది.

To Top

Send this to a friend