నితిన్ లో కోట్లు కొల్లగొట్టే స్టామినా ఉందా.?

అఆ సినిమాతో 50 కోట్లు కొల్లగొట్టిన హీరో నితిన్ ఆ సినిమా తర్వాత చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు.. ఆ సినిమాకు త్రివిక్రమ్ మాయ తోడవడంతో అఆ ఘనవిజయం సాధించింది. పైగా టాప్ హీరోయిన్ సమంత కీలక పాత్ర కూడా ఆ సినిమాకు ప్లస్ అయ్యాయి. కథ, కథనం బాగా పండించిన త్రివిక్రమ్ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించారు.

అఆ సినిమా నితిన్ ఢిఫెన్స్ లో పడ్డారు. రోటీన్ ప్రేమకథా స్టోరీలకు కాస్త పుల్ స్టాప్ పెట్టాడు. ఖచ్చితంగా హిట్ కొట్టే కథనే ఎంచుకోవాలని చాలా కాలంగా కథల్ని రిజక్ట్ చేస్తున్నాడట.. ఈ మధ్యే నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.. అదే రాఘవపూడి చెప్పిన కథ నితిన్ కు నచ్చడం.. అదీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండడం విశేషం. ఇందులో అర్జున్ విలన్ గా నటిస్తున్నారు. ముప్పాతిక శాతం అమెరికా లో షూటింగ్ జరుపుకుంటోందట.. అమెరికా అంటే భారీ ఖర్చు.. 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం నితిన్ కు భారీ బడ్జెట్ చిత్రం. అంత భారీ బడ్జెట్ చిత్రంలో నటించడం నితిన్ కు ఇదే తొలిసారి.. యంగ్ హీరోను బెట్టి భారీ బడ్జెట్ తో సినిమా తీయడం నిర్మాతలకు కత్తిమీద సామే.. మరి అలాంటి సాహసానికి దిగుతున్న నిర్మాతలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే అందరికీ మంచిది.

To Top

Send this to a friend