నిగ్గదీసి అడుగు.. బాబూ, మోడీలను…

అందరూ చెప్పారు.. అయినా సరిపోలేదు.. అందుకే ఇప్పుడు స్వయంగా దేవుడు దిగిరావాలి.. తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా చెప్పిన మాటలను ఆ దేవుడే వచ్చి సాక్షం చెప్పాలి. అధికారం కోసం ఉచిత హామీలు ఇచ్చి మోసం చేసిన వారిని నిలదీయాలి. అప్పుడే ఏమైనా ప్రజల హామీలు నెరవేరుతాయేమో.. ఏపీ ప్రజల గోడు ఈ నాయకుల చెవికి ఎక్కుతుందేమో..

ప్రధాని మోడీ నాడు అధికారంలోకి రావడానికి ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు. కనీసం 5 ఏళ్లు ఏపీకి హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అదే వేదికపై చంద్రబాబు 5ఏళ్లు సరిపోదు మోడీజీ.. పదిహేనేళ్లు ఇవ్వండి అని కోరారు. ఆ తరువాత చంద్రబాబు నాలుక మడతేశాడు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్నారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకి సరేనన్నాడు. హోదా కంటే ఎక్కువే రాష్ట్రానికి ప్రయోజనాలు కలుగుతున్నాయని కేంద్రాన్ని వెనుకేసుకొచ్చాడు. ఎక్కడైనా సీఎం ప్రజల తరఫున హోదా, నిధులు కోసం పోరాడాలి.. కానీ మన చంద్రబాబు కేంద్రానికి వెనకేసుకొస్తూ మాకు ఫుల్లుగా ఇస్తోందని చెప్పడం కొసమెరుపు జగన్ చెప్పినట్టు బాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడా..? ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు కేంద్రాన్ని ఏమీ అడగలేనిస్థితి కి చేరాడా అంటే ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎలా తెలుస్తుంది..?

అందుకే ఇప్పుడు ప్రజలు రోడ్డెక్కారు. హామీ ఇచ్చి అంటకాగిన పవన్ సైతం తాను అన్న మాటను నిలుపుకునేందుకు ప్రజలతో కలిసి పోరాడుతున్నారు. విశాఖలో ఏపీ యువత ఏర్పాటు చేసి ప్రత్యేకహోదా ఆందోళనలకు మద్దతుగా పవన్ చంద్రబాబును నిగ్గదీసి అడుగుతున్నాడు.. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో అగ్గి రాజేస్తున్నాడు. ప్రజల ఆక్రోశం, ఆవేదనను కనీసం ఒక్కసారైనా చెప్పుకునే అవకాశం ఇవ్వండి చంద్రబాబు గారూ అని కోరుతున్నారు. ఆంధ్రులకు చేసిన మోసాన్ని గుర్తించి భవిష్యత్ లోనైనా ఆంధ్రా న్యాయం జరగాలని పవన్ కోరుకుంటున్నారు. ఇలా చంద్రబాబు హోదా విషయంలో వెనక్కుపోయి టార్గెట్ అయ్యారు. అందరి చేతులు మోడీ, బాబులనే చూపిస్తున్నాయి. విశాఖ వేదికగా ఈరోజు జరిగే ఆందోళనలు ఏపీ సీఎం చంద్రబాబుకు గట్టిగానే తగులుతున్నాయి.

పవన్ ట్వీట్లను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend