నా బొమ్మలు పెడతారా? కేటీఆర్

ఆయన స్వయానా సీఎం కేసీఆర్ కొడుకు.. సీఎం తర్వాత ప్రభుత్వంలో నంబర్ 2 పొజిషన్. అందుకే కేటీఆర్ అంటే అందరికీ అభిమానం. ఆ అభిమానమే శృతి మించడంతో కేటీఆర్ ఆగ్రహించారు. ఏకంగా తమ సొంత పార్టీ టీఆర్ఎస్ నేతలపైనే ఫైర్ అయ్యారు. దీనికి కారణం.. కేటీఆర్ ఫ్లెక్సీలను హైదరాబాద్ లో విపరీతంగా ఏర్పాటు చేయడమే..

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఇటీవల సికింద్రాబాద్ లోని బాపూజీనగర్ లో అభివృద్ది పనుల ప్రారంభోత్సవానికి వెళ్లారు. 1.50కోట్లతో నిర్మించిన నూతన వంతెనను సహచర మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్ లతో కలిసి ప్రారంభించారు. అయితే కేటీఆర్ పర్యటన సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో మంత్రి గారికి మండిపోయింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన స్థానిక టీఆర్ ఎస్ నేతలపై మండిపడ్డారు..

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామని.. ఈ క్రమంలో ఫ్లెక్సీల రహిత నగరం కోసం తాము పిలుపునిస్తే అదేమీ పట్టించుకోకుండా ఎందుకు ఇలా చేశారని కేటీఆర్ నిలదీశాడు. మరోసారి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కంటోన్మెంట్ సీఈవోను కేటీఆర్ హెచ్చరించారు.

To Top

Send this to a friend