నారారోహిత్ ముఖ్యఅతిథిగా జ‌న చైత‌న్య ర్యాలీ

విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ న‌టుడుగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్ సినిమాల‌కే ప‌రిమితం కాకుండా సామాజిక సేవ‌లో కూడా భాగ‌మ‌వుతున్నారు. ఆనంత‌పురంలో ఎ.బి.ఎన్‌.ఆంధ్ర‌జ్యోతి చానెల్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న వ‌నం కోసం మ‌నం అనే కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్నారు. ఈ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం ఎన్.బి.కె.హెల్పింగ్ హ్యాండ్ఆ జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతుంది. జూలై 3 ఉద‌యం 9 గంట‌ల‌కు ఈ జ‌న చైత‌న్య ర్యాలి ట‌వ‌ర్ క్లాక్ నుండి ఎన్‌.టి.ఆర్ విగ్ర‌హం వ‌ర‌కు ఈ ర్యాలి జ‌రుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

To Top

Send this to a friend