నాడు ఎన్టీఆర్ ను.. నేడు భూమాను..

ఇదే చంద్రబాబు.. నాడు ఎన్టీఆర్ ను నేడు.. భూమా నాగిరెడ్డిని మానసిక క్షోభకు గురిచేసి చంపారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భూమాకు మంత్రి పదవి ఇస్తానని.. కేసులు మాఫీ చేయిస్తానని చెప్పి పార్టీలోకి తీసుకొని ఏడాదైనా ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారని.. అందుకే భూమా మనస్తాపంతో గుండెపగిలి చనిపోయారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడిన జగన్ చంద్రబాబు తీరుపై ఆక్షేపించారు.
భూమా నాగిరెడ్డి సంతాప తీర్మాన్ని రాజకీయం చేస్తున్నారని బాబు దిగజారుడు రాజకీయాలు అవసరమా అని జగన్  ప్రశ్నించారు. భూమా హుదాతనం కాపడడానికే తాము అసెంబ్లీకి వెళ్లలేదన్నారు. తాము సభకు వెళితే చంద్రబాబు భూమా విషయంలో చేయించిన తప్పులు, భూమా చేసిన పనుల గురించి మాట్లాడాల్సి వచ్చేదని.. అవన్నీ రికార్డుల్లో వెళ్లేవని.. అందుకే తాము సభకు వెళ్లలేదని వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు, చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు.
తండ్రి మృతిచెందిన 24 గంటల్లోనే అఖిలప్రియను అసెంబ్లీకి చంద్రబాబు తీసుకురావడం బాబు కుసంస్కరానికి నిదర్శనమి జగన్ మండిపడ్డారు. నాగిరెడ్డి చనిపోయిన విషయం తెలియగానే తాను, అమ్మ ఫోన్లో మాట్లాడామన్నారు.  భూమా నాగిరెడ్డి మరణించారని.. ఆయనపై వివాదాలు అనవసరమని వైఎస్ జగన్ అన్నారు. అలాగే నంద్యాల సీటు వైసీపీదేనని.. భూమా వైసీపీపైనే గెలిచారన్నారు. అక్కడ ఉప ఎన్నికపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
To Top

Send this to a friend