నవంబర్ 25న మోహన్ లాల్ ‘మన్యం పులి’

img-20161015-wa0008

మల్లూవుడ్ లో కలెక్షన్ల మోత మోగించిన మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ ‘పులిమురుగన్’ చిత్రాన్ని తెలుగులో ‘మన్యం పులి’పేరిట విడుదల చేస్తున్నారు శ్రీ సర్వసతి ఫిల్మ్స్ అధినేత ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. ఇప్పటికే ‘మన్యంపులి’ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పాటల రికార్డింగ్ కూడా పూర్తి అయిందని చిత్ర బృందం తెలిపింది. ఈ నేపథ్యంలో మన్యం పులి ని నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత కృష్ణారెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ‘జనతా గ్యారేజ్’ సినిమాతో మోహన్ లాల్కి తెలుగునాటు ఫుల్ క్రేజ్ రావడంతో, అదే ఊపులో ‘మన్యంపులి’ సైతం భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉందనిటాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసరప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, చిత్ర బృందంతెలిపింది. జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ :ఉదయ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్

To Top

Send this to a friend