నవంబర్ 1 న `రెమో` ఆడియో

remo-keerthisuresh-apnewsonline

శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్ జంట‌గా బ‌క్కియ రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లవ్  ఎంట‌ర్‌టైన‌ర్ `రెమో`. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నారు.  ఈ సినిమా ఆడియో నవంబర్ 1 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

 

దిల్ రాజు మాట్లాడుతూ – “హీరో శివ‌కార్తికేయ‌న్ రెమో సినిమాలో మూడు వేరియేష‌న్స్‌లో అద్భుతంగా యాక్ట్ చేశాడు. పి.సి.శ్రీరాంగారి సినిమాటోగ్ర‌ఫీ, అనిరుధ్ సంగీతం సినిమాకు మ‌రింత స‌పోర్ట్ చేశాయి. రెమో ష్యూర్ షాట్ హిట్ మూవీ అవుతుంది. డెబ్యూ డైరెక్ట‌ర్ బక్కియ రాజ్ క‌న్న‌న్ చేసిన సినిమా త‌మిళనాడులో 65-70 కోట్లు క‌లెక్ట్ చేయ‌డం చిన్న విష‌యం కాదు. రెమో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అవుతున్న శివ‌కార్తికేయ‌న్‌కు అభినంద‌న‌లు. ఈ చిత్రం ఆడియో నవంబర్ 1 న విడుదల అవుతుంది“ అన్నారు.

To Top

Send this to a friend