నవంబర్ లో మోహన్ లాల్ ‘మన్యం పులి’

img-20161015-wa0008

‘జనతాగ్యారేజ్’ తో టాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకున్న మోహన్ లాల్ మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. మల్లూవుడ్ లో కలెక్షన్ల మోత మోగించిన మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ ‘పులిమురుగన్’చిత్రాన్ని తెలుగులో ‘మన్యం పులి’ పేరిట విడుదల చేసేందుకు ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘మన్యం పులి’ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ముగిశాయి. పాటల రికార్డింగ్ కూడా పూర్తి అయిందని చిత్ర సంగీత దర్శకుడు గోపీ సుందర్ తెలిపారు.ఇక సౌత్ ఇండియా నుంచి ‘బాహుబలి’ తరువాత మళ్లీ అంతే రేంజ్ లో సక్సెస్ అందుకున్న సినిమాగా మళయాల సీమలో ‘మన్యం పులి’ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

ఈ నేపథ్యంలో ‘జనతా గ్యారేజ్’ సినిమాతో మోహన్ లాల్ కి తెలుగునాట ఫుల్ క్రేజ్ రావడంతో, అదే…ఊపులో ‘మన్యంపులి’ సైతం భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా నవంబర్ లో ‘పులి మురుగన్’ తెలుగు వెర్షన్ ‘మన్యం పులి’ ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాత కృష్ణా రెడ్డి తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాలు పాటుఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, చిత్ర బృందం తెలిపింది. జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్.

To Top

Send this to a friend