నరహంతుకుడు నయీం నెత్తుటి మరకను కడిగిసేకుంటారా..?

nayuum

వందల హత్యలు, అత్యాచారాలు, ఓ ఐపీఎస్ అధికారి హత్య, గ్యాంగ్ స్టర్ లు, దోపిడీలు, ముఠా తగాదాలు, భూ కబ్జాలు ఇలా ఓ నెత్తుటి సామాజ్రాన్ని సృష్టించి ఎందరినో బలికోరిన నరహంతకుడి నయీం రక్తచరిత్రను తెలంగాణ ప్రభుత్వం దారుణంగా కడిగేసుకుంది.. రెండు రోజుల క్రితం స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. కాంగ్రెస్ హయాంలో మాజీ డీజీపీ, మాజీ మంత్రితో నయీంకు సంబంధాలున్నాయని.. నయీం డైరీలో చాలా మంది ప్రజాప్రతినిదులు, అధికారుల పేర్లున్నాయని.. అవన్నీ బయటపెడితే చాలా మంది జైలు పాలవుతారని హెచ్చరించారు. కానీ రెండు రోజులకే ఏమైంది. ఆ పాపపంకిలాన్ని రక్తపు మరకలను అందరూ తోడుదొంగలై కడిగేసుకున్నారు.
నక్సల్ నుంచి గ్యాంగ్ స్టర్ గా ఎదిగే క్రమంలో నయీంకు చాలా మంది పోలీసులు, ప్రజాప్రతినిధులు సహకరించి అతడిని ఈ స్థాయికి చేర్చారు.. అది వాస్తవం.. కానీ తెలంగాణ ప్రభుత్వం గురువారం హైకోర్టులో నయీం కేసులో కౌంటర్ దాఖలు చేసింది. నయీంకు ప్రజాప్రతినిధులు, పోలీసులతో సంబంధాలున్నాయన్నది ఆరోపణ మాత్రమేనని.. ఎలాంటి రుజువులు లేవని నిసిగ్గుగా అబద్దమాడింది..ఎంతో మందిని అమ్మాయిలను , బాలికలను సజీవ దహనం చేసి ఉసురుపోసుకున్న నయీం కేవలం అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేను బెదిరిస్తే హతమయ్యాడనేది వాస్తవం అంశం.. లేకుంటే అతడి ఆగడాలు ఇంకా మనం అనుభవించేవాళ్లమే.. అతడు హతమైన అతడితో నేరసామ్రాజ్యంలో పాలుపంచుకున్న వాళ్లను ప్రభుత్వం వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ చర్యపై సామాజిక వాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు..

To Top

Send this to a friend