నయీం నెత్తుటి చార కడిగేసుకుంటావా కేసీఆర్ జీ?

ఏకు మేకు అయ్యాడని టార్గెట్ చేశారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేను కార్నర్ చేశాడని.. అధికారపార్టీకే కంట్లో నలుసులా మారాడని చివరకు హతమార్చారు. తమ దాకా వస్తే కానీ కేసీఆర్ సర్కారుకు నరహంతకుడు నయీం ఆగడాలు తెలిసిరాలేదు. చివరకు పోలీసులతో హతమార్చినా అతడి నెత్తుటి మరకలను కడిగేయాల్సిన ప్రభుత్వం కేసులనే ఉపసంహరించుకోవడం నివ్వెరపరుస్తోంది..
నయీం నక్సలైట్ గా ప్రస్తానం మొదలుపెట్టారు. అతడిని పోలీసులు కోవర్టుగా వాడుకొని నక్సలైట్లను అంతం చేశారు. అనంతరం నయీంను సమాజంలోకి తీసుకొచ్చి పోలీసులు అసాంతం వాడుకున్నారు. గ్యాంగ్ స్టర్ లను, సంఘ విద్రోహ శక్తులను హతమర్చారు. చివరకు పోలీసులు, ప్రజాప్రతినిధుల అండదండలతో అతడు అమాయాకుల జీవితాలతో ఆడుకున్నా ఇదే పోలీసులు, ప్రజాప్రనిధులు అతడికి సపోర్టు చేసి ప్రజల ఉసురు తీసుకున్నారు.
నయీం వందల హత్యలు, అత్యాచారాలు, ఓ ఐపీఎస్ అధికారి హత్య, గ్యాంగ్ స్టర్ లు, దోపిడీలు, ముఠా తగాదాలు, భూ కబ్జాలు ఇలా ఓ నెత్తుటి సామాజ్రాన్ని సృష్టించి ఎందరినో బలికోరారు. నరహంతకుడి నయీం రక్తచరిత్రను తెలంగాణ ప్రభుత్వం దారుణంగా కడిగేసుకుంది.. నయీం దారుణాల్లో పాలుపంచుకున్న పోలీసులు, ప్రజాప్రతినిధులపై ఆధారాలు లేవంటూ పలు కేసులను పోలీస్ శాఖ కోర్టులో మూసివేతకు పిటీషన్ వేయడం సంచలనం రేపింది. నయీం డైరీలో చాలా మంది ప్రజాప్రతినిదులు, అధికారుల పేర్లున్నాయని.. అవన్నీ బయటపెడితే చాలా మంది జైలు పాలవుతారు. ఇప్పటికే సోషల్ మీడియాలో నయింతో సన్నిహితంగా ఉన్న పోలీసులు, ప్రజాప్రతినిధుల ఫొటోలు వచ్చాయి. ఆ పాపంలో వారికి భాగం ఉంది. కానీ ఆధారాలు లేవంటూ కేసీఆర్ సర్కారు, పోలీసులు ఆ పాపపంకిలాన్ని రక్తపు మరకలను తోడుదొంగలై కడిగేసుకున్నారు.
ఆధారాలు లేవంటూ ప్రజాప్రతినిధులు, పోలీసులను రక్షించే పనిలో భాగంగా కేసులు మూసివేయాలని కోర్టులో పోలీస్ శాఖ పిటీషన్ దాఖలు చేసింది… సంబంధాలున్నాయన్నది ఆరోపణ మాత్రమేనని.. ఎలాంటి రుజువులు లేవని నిసిగ్గుగా అబద్దమాడింది.. భూకబ్జాలు, హత్యలు, దోపిడీలు,, ఎంతో మందిని అమ్మాయిలను , బాలికలను సజీవ దహనం చేసి ఉసురుపోసుకున్న నయీం కేసును కేసీఆర్ సర్కారు ఇలా దొంగచాటుగా ఆధారాలు లేవంటూ ఉపసంహరించుకోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. నయీం హతమైనా.. అతడితో నేరసామ్రాజ్యంలో పాలుపంచుకున్న వాళ్లను ప్రభుత్వం వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ చర్యపై సామాజిక వాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు..

To Top

Send this to a friend