నయీంతో అంటకాగిన పోలీసుల బండారం..

మాజీ నక్సలైట్.. గ్యాంగ్ స్టర్ నయీం పోలీసులతో నడిపిన చీకటి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఇవి వైరల్ లా వ్యాపించాయి. ఎంతో మందిని బెదిరించి .. చంపేసి .. భూములు లాక్కోని కోట్లకు పడగలెత్తిన విషపు పాము అయిన నయీం చివరకు పోలీసుల ఎన్ కౌంటర్ లోనే హతమైన సంగతి తెలిసిందే..
నయీంను పోలీసులే ఆ స్థాయి కి తెచ్చారు. వారితో బంధాలు ఏర్పరచుకొని నయీం నెత్తుటి చీకటి సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. నయీంకు పోలీసుల అండగా నిలవడంతో భూదందాలు.. దోపిడీలు, హత్యలు చేశారు. కానీ నయీం ఎన్ కౌంటర్ తర్వాత అతడికి సహకరించిన పోలీసులు, రాజకీయ నాయకుల పేర్లు చాలా బయటకు వచ్చాయి.కానీ ప్రభుత్వం దీనిపై సిట్ వేసి కొంత మంది చిన్న చేపలను అరెస్ట్ చేసి బడా పోలీసులను, రాజకీయ నాయకులను వదిలేసింది..
కానీ నయీంతో అంటకాగిన పోలీసులు, నాయకులను సోషల్ మీడియా వదల్లేదు.. ప్రస్తుతం సీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న మద్దిపాటి శ్రీనివాసరావు నయీంతో విందులో, వినోదాల్లో సాగించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాళ్లిద్దరు ఓ రెస్టారెంటులో భోజనం చేస్తున్న ఫొటోలు వైరల్ లా వ్యాపించాయి. మద్దిపాటి గతంలో నల్లగొండ జిల్లాలో ఎస్ఐ, సీఐగా పనిచేసినప్పుడు నయీంతో సన్నిహిత సంబంధాలు నెరిపారు.

To Top

Send this to a friend