నమో వేంకటేశా.. అటు కేసీఆర్.. ఇటు ఏపీ ప్రజలు


ఆయన మగాడ్రా బుజ్జీ అంటారు అందుకే.. కేసీఆర్ ఏదీ చేసినా సంచలనమే.. ఆయన రాజకీయం.. వ్యూహాలు అన్ని ప్రత్యేకమే.. ఎవరూ అలా చేయరు అంతే.. ఎందుకంటే.. తెలంగాణ రావాలని తెలంగాణలోని దేవుళ్లకు మొక్కడం ఒక సంప్రదాయం.. కానీ తెలంగాణ రావాలని.. మరీ ఏపీలోని దేవుళ్లకు మొక్కారు కేసీఆర్. ఏపీ ప్రజలకు కంటగింపు గా మారిన కేసీఆర్ ఏపీకి వెళ్లి మరీ మొక్కులు చెల్లించుకున్నాడంటే అదే మరి కేసీఆర్ స్టెబిలిటీ అంటే..

మామూలుగా రాష్ట్రం వచ్చిన కొత్తలో కేసీఆర్ పై ఏపీ ప్రజలకు పీకలదాక కోపం ఉండేది. ఎందుకంటే కేసీఆర్ చేయవట్టే తామంతా రోడ్డున పడ్డామని తిట్టుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆరే అందరూ పొగుడుతున్నారు. ఏపీ విడిపోవడంలో అక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ జరిగింది.. ప్రతి జిల్లాకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. అంతకుముందు హైదరాబాద్ చుట్టూ అభివృద్ది జరిగి.. అక్కడే తిరిగిన నేతలు స్థానికంగా ఉంటూ అభివృద్ధి చేయిస్తున్నారు. జిల్లాలకు అభివృద్ధి అందుతోంది.. అందుకే కేసీఆర్ రెండున్నరేల్ల తర్వాత వచ్చినా ఆయన కు తిరుపతిలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
అయినా దేవుడు.. అందరికీ దేవుడే.. దేవుడికి కుల, ప్రాంత బేధాలుండవు.. కేసీఆర్ కోరుకున్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలి.. కానీ విచిత్రం ఏంటంటే.. కేసీఆర్ తెలంగాణ విడిపోవాలని ఏపీలోని దేవుళ్లను కోరడమే వెరైటీ.. ఏపీలోని తిరుమల వేంకటేశ్వరుడికి అక్కడి భక్తులు, ఏపీ ప్రజలు ఎన్నోసార్లు రాష్ట్రం విడిపోవద్దని వేడుకున్నారు. అయినా పక్కరాష్ట్రం సీఎం మొర ఆలకించి వేంకటేశుడు తెలంగాణ ప్రసాదించాడు. అది లోకకల్యాణానికే దారితీసింది.. అటు తెలంగాణ అభివృద్ధి చెందుతోంది.. ఇటు ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరించబడింది..

అందుకే ఏపీ ప్రజల కోరికను(రాష్ట్రం విడిపోవద్దని) తీర్చలేదని దేవుడిని ఎవ్వరూ తప్పుపట్టడం లేదు. పాలన ముందటికి తెచ్చి.. తెలంగాణను విభజించి.. ఏపీ అభివృద్ధికి బాటలు వేసిన వేంకటేశ్వరుడిని కీర్తిస్తున్నారు. ఇప్పుడు ఇదే అందరినోట.. కేసీఆర్ మొక్కును ఏపీ లోని దేవుళ్లు తీర్చారు.. అది ఏపీకి కూడా లాభమైంది.. రెండు రాష్ట్రాలకు మేలు చేశాడు ఆ నమో వేంకటేశుడు.. కాదంటారా..?

To Top

Send this to a friend