నగదు పరిమితిపై ఆర్బీఐ తీపి కబురు..

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో నగదు కొరత, ప్రజల అవస్థలు చెప్పనలవికాని విధంగా తయారయ్యాయి. డిసెంబర్ 30 తో గడువు ముగియడంతో కొద్దిగా ఏటీఎంలు, బ్యాంకుల్లో రద్దీ తగ్గింది. కానీ నగదు ఉపసంహరణలు, జమ చేసే దానిపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా విత్ డ్రా పరిమితిని పెంచేందుకు కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలియడంతో ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఈ వారంలో విత్ డ్రా పరిమితిని కేంద్రం సేవింగ్స్ ఖాతా అయితే రూ.24 నుంచి 35 వేలకు, కరెంట్ ఖాతా అయితే రూ. 50వేల నుంచి అపరిమితంగా పెంచేందుకు నిర్ణయించనట్టు సమచారం.. దీంతో మళ్లీ మునుపటి బ్యాంకు లావాదేవీల వలే ఖాతాదారులకు ఉపశమనం కలుగనుంది..

పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్రం ఏటీఎంలో నగదు పరిమితిపై, బ్యాంకుల్లో విత్ డ్రాపై పరిమితి విధించింది. ఏటీఎంలలో మొదట 2500 నుంచి 4500కు పెంచింది. ఇక బ్యాంకుల్లో 10 వేల నుంచి క్రమంగా 24వేలకు పెంచింది.. ఇప్పుడు విత్ డ్రా లిమిట్ ను మొత్తంగా ఎత్తివేసేందుకు లేదా పరిమితి పెంచేందుకు నిర్ణయం తీసుకుంటుండడంతో ఖాతాదారులు ఆనందం పడుతున్నారు..

To Top

Send this to a friend